Home » Entertainment » Annie Now Studies Degree Commerce Hyderabad
Entertainment

Annie : రాజ‌న్న‌లో క‌నిపించిన చిన్నారి ఇంత పెరిగి పెద్దదైందా.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: July 23, 2022, 8:30 pm
Advertisement

Annie : రాజ‌మౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో హీరో నాగార్జున అక్కినేని లీడ్‌రోల్ లో వచ్చిన మూవీ ‘రాజన్న’. ఇందులో నాగార్జున స్వాతంత్ర్య‌ సమరయోధుడు రాజన్నగా కనిపించగా ఆయనకు భార్యగా నటి స్నేహ నటించింది. 2011లో వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది, ఇక ఇందులో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన ఆ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. మల్లమ్మగా తన తండ్రి రాజన్న చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని పాటల రూపంలో తెలుపుతూ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుంది.ఈ చిన్నారి. 4 ఏళ్ల వయసులోనే కెరీర్‌ను స్టార్ట్ చేసిన అన్నీ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు నంది అవార్డులు కూడా ఉన్నాయి.

Advertisement

రాజ‌న్న చిత్రంలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి అసలు పేరు అనీ. రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. ‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్‌ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్‌ చరణ్‌) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్‌ డిగ్రీ కాలేజీలో కామర్స్‌ చదువుతుంది.

annie now studies degree commerce hyderabad

Advertisement

Annie : అనీ స్ట‌న్నింగ్ లుక్స్..

రాజన్న తర్వాత అన్నీ మళ్లీ చెప్పుకోదగిన సినిమాలు ఏమీ చేయలేదు. చాలాకాలం తర్వాత ‘లూసర్ 2’ అనే వెబ్ సిరీస్‌లో లీడ్‌గా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది అనీ. వెండితెర‌కు దూరంగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి కేక పెట్టించే అందాల‌తో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తూ ఫోటో షూట్ చేసింది. అనీ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అనీని చూసి ఈ చిన్నారి ఇంత పెద్దది అయిందా అంటూ కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి