Vallabhaneni Vamshi : ఇద్దరు సీఎంలు.. రెండు ప్రభుత్వాలు — తేడా చెప్పిన వల్లభనేని వంశీ
Vallabhaneni Vamshi : ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవ వేడుకలను గన్నవరం మార్కెట్ యార్డ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డు కమిటీ సభ్యులకు వంశీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. పార్టీలో కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అయితే.. తనకు రెండు ప్రభుత్వాల్లో పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులను తాను దగ్గరి నుంచి చూశానని..ఇద్దరు ముఖ్యమంత్రుల పని గురించి వంశీ చెప్పుకొచ్చారు.అయితే.. ఏపీలో కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను ప్రారంభించి.. సీఎం జగన్ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేశారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రస్తుతం మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని దరఖాస్తులు పెట్టినా సంక్షేమ పథకాలు అందలేదు. కానీ.. ఈ ప్రభుత్వంలో ఎలాంటి అర్జీలు లేకుండా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని.. అదే ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా అని వంశీ స్పష్టం చేశారు. అయితే..
Vallabhaneni Vamshi : 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుకు కడుపు మంట తప్పితే ఏం లేదు
45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చంద్రబాబుకు కడుపు మంట తప్పితే ఇంకేం లేదని వంశీ విమర్శించారు. తనకు దీటైన రాజకీయాలు చేసిన రాజశేఖర్ రెడ్డి కొడుకు ఏపీకి ముఖ్యమంత్రి అయితే.. తన కొడుకు లోకేశ్ మాత్రం మంగళగిరిలో కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడని.. అదే చంద్రబాబు కడుపు మంటకు కారణం అంటూ చెప్పుకొచ్చారు వంశీ. అసలు రాజకీయాల్లో అంత అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు అమ్మ ఒడి లాంటి పథకాలను ప్రారంభించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఇంకా ఏపీ భవిష్యత్తులో చాలా అభివృద్ధి జరగనుంది. దానికోసం.. మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఈసందర్భంగా వంశీ కోరారు.