Vangaveeti Radha Krishna : వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ వింటే షాకే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ వింటే షాకే..!!

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో త్వరలో నిశ్చితార్థం జరగనుంది. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తుంది. 41 సంవత్సరాలు వయస్సు కలిగిన వంగవీటి రాధా చాలా కాలం తర్వాత పెళ్లికి రెడీ కావడం ఆయన కుటుంబ సభ్యులలో కూడా సంతోషం నెలకొంది. ఇంతకీ వంగవీటి రాదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు చూస్తే నరసాపురం పట్టణానికి చెందిన అమ్మాయిని వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారట. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :17 August 2023,7:00 pm

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో త్వరలో నిశ్చితార్థం జరగనుంది. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తుంది. 41 సంవత్సరాలు వయస్సు కలిగిన వంగవీటి రాధా చాలా కాలం తర్వాత పెళ్లికి రెడీ కావడం ఆయన కుటుంబ సభ్యులలో కూడా సంతోషం నెలకొంది. ఇంతకీ వంగవీటి రాదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు చూస్తే నరసాపురం పట్టణానికి చెందిన అమ్మాయిని వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారట.

వంగవీటి మిత్రుడి దగ్గర బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందట. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమని బాబ్జీల చిన్న కుమార్తెల జక్కం పుష్పవల్లి..తో ఈనెల 19వ తారీఖు నరసాపురంలో ఎంగేజ్మెంట్ ఉంటుందని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. విజయవాడలో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.

Vangaveeti Radha Krishna will marry this Andhra Pradesh woman

Vangaveeti Radha Krishna will marry this Andhra Pradesh woman

2004లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం నుండి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి పార్టీలో జాయిన్ అయిన వంగవీటి రాధా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా వంగవీటి రాధా పోటీ చేయలేదు ప్రచారానికి పరిమితమయ్యారు. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే వంగవీటి రాధా ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. రాధా చేసుకోబోయే అమ్మాయి కుటుంబం పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావటంతో.. ఇది ఒక రకంగా రాధాకి చాలా ప్లస్ అని అంటున్నారు.

https://youtu.be/i8AIs35nAsU

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది