#image_title
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వర్షిణికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకప్పగించారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అఘోరీ ఎక్కడ ఉన్నాడో తెలియకపోగా, వర్షిణి ఇటీవల కొన్నిమీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొనడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ మీడియా ముందు నిలుస్తున్నారు. తాజాగా వర్షిణి సెల్ఫీ వీడియోలో అఘోరీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
#image_title
సంచలన కామెంట్స్
“డబ్బుల కోసం అఘోరీ వెంట వెళ్లాననడం తప్పు” అని వర్షిణి స్పష్టం చేసింది. “అఘోరీ వద్ద పెట్రోల్‌కు కూడా డబ్బులు లేవు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా అతని కారు ఖాళీగానే ఉంది” అని పేర్కొంది. “మొదటిసారి అతనితో వెళ్లినప్పుడు అతనివద్ద ఏముందో తెలియదు. రెండోసారి వెళ్లినపుడు కూడా ఏమీ లేవని తెలిసే వెళ్లాను. అతను చెప్పిన మాటలు నమ్మి వెళ్లాను” అని వర్షిణి చెప్పింది.
అఘోరీ మొదటి పెళ్లి గురించి అడిగినప్పుడు అబద్ధం చెప్పాడని వర్షిణి ఆరోపించింది. “మనిద్దరం పెళ్లి చేసుకుంటే సమాజం ప్రశ్నలు అడగదని నన్ను నమ్మించాడు. కానీ అది అసలు పెళ్లే కాదని నాకు తర్వాత తెలిసింది. అతనితో వెళ్లడం చాలా పెద్ద తప్పు” అని ఆమె ఒప్పుకుంది.తనను ట్రాప్ చేసి మోసం చేశాడని వర్షిణి ఆరోపిస్తూ, “నేను ఇంటికొచ్చాక అందరూ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా?” అని ప్రశ్నించింది. “అఘోరి కుక్కలాగా వాగితే నేను సైలెంట్‌గా ఉండాలా? వాడివల్ల నా కుటుంబం ఇబ్బందులు పడింది. మాట్లాడే ముందు ఆలోచించు అల్లూరి శ్రీనివాస్. మోసం చేసింది నువ్వు.. మోసపోయింది నేనే” అని ఆమె మండిపడింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.