Home » Entertainment » Varun Tej Ghani Movie July 30 Released
Entertainment

Varun tej Ghani : వరుణ్ తేజ్ గని నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగా ప్రిన్స్ ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: January 28, 2021, 11:41 am
Advertisement

Varun tej  Gani Movie : వరుణ్ తేజ్ గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు బాబీ – సిద్దు ముద్ద భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా వెల్లడించాడు. గని సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన యూనిట్ సభ్యులు విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

Advertisement

varun tej ghani movie July 30 Released

వరుణ్ తేజ్ గని సినిమాను జులై 30 తేదీన విడుదల చేయబోతున్నట్లుగా కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. వాస్తవంగా గని సినిమాను మొన్నటి వరకు మే నెలలో విడుదల చేయనున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఈ కారణంగా జులై 30వ ఏదీన గని సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు దర్శక, నిర్మాతలు. గని సినిమా నుంచి ఇలాంటి సర్‌ప్రైజ్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు.

Advertisement

Varun Tej Ghani : సమ్మర్ లోపు రెండు సినిమాలతో వరుణ్ తేజ్..!

గని సినిమాతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా కూడా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వెకటేష్ – వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్ హీరో హీరోయిన్స్ గా భారీ మల్టీస్టారర్ సినిమా గా రూపొందుతోంది. కాగా వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్ 3 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. కాగా ఎఫ్ 3 విజయదశమొ పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి