Veg Dum Biryani Recipe : చికెన్ బిర్యాని కి మించిన, వెజ్ దమ్ బిర్యాని.. ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Veg Dum Biryani Recipe : చికెన్ బిర్యాని కి మించిన, వెజ్ దమ్ బిర్యాని.. ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు…!

Veg Dum Biryani Recipe : వెజ్ దమ్ బిర్యాని.వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి చేసుకున్నట్లయితే చికెన్ దమ్ బిర్యాని ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో ఈ వెజిటబుల్స్ అన్ని కలిపి దమ్ బిర్యాని రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఇది రెడీ చేసుకోవడం ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ తోటే టేస్టీగా వెజ్ దమ్ బిర్యాని రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ వెజ్ దమ్ బిర్యాని ఎలా రెడీ చేసుకోవాలి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 October 2022,7:30 am

Veg Dum Biryani Recipe : వెజ్ దమ్ బిర్యాని.వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి చేసుకున్నట్లయితే చికెన్ దమ్ బిర్యాని ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో ఈ వెజిటబుల్స్ అన్ని కలిపి దమ్ బిర్యాని రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఇది రెడీ చేసుకోవడం ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ తోటే టేస్టీగా వెజ్ దమ్ బిర్యాని రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ వెజ్ దమ్ బిర్యాని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము బిర్యానీ రెడీ . దీనికి కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం, క్యారెట్లు ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణి బీన్స్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి, పెరుగు, నిమ్మరసం, నెయ్యి, ఆయిల్, పచ్చిమిర్చి, బిర్యాని

మసాలాలు,మొదలైనవి… బిర్యానీ రెడీ చేసుకునే ముందు మనం ఫ్రైడే ఆనియన్స్ ని రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు దానిలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ పోసుకొని బాగా కడగాలి మనం ఇలా పిసికి కడగడం ద్వారా దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి వెళ్లిపోతుంది. ఇలా రెండు మూడు సార్లు కడిగిన బియ్యంలో నీటిని వేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై మందపాటి బాండిని పెట్టుకుని దాన్లోని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర ,కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి ,కొంచెం నూనె, కొంచెం పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

Veg Dum Biryani Recipe in Telugu

Veg Dum Biryani Recipe in Telugu

ఇక తర్వాత ఇంకొకపక్క ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాన్లో వాటిని పోసి దానిలో బిర్యాని సంబంధించిన ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి ఒక పొంగు రాగానే దాంట్లో బియ్యం వేసి 80% ఉడికించుకోవాలి. తర్వాత ఆ వాటర్ తీసేసిన రైస్ ని మ్యారినేట్ చేసి పెట్టుకొన్న కూరగాయల మిశ్రమంలో వేసి అంత సెట్ చేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడే అనియన్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వాటర్ ని కూడా దానిపైన వేయాలి. అలాగే దాని పైన కొంచెం నెయ్యిని కూడా వేసి ఇక ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి మూతపెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి. తర్వాత స్టవ్ ఆపి పదినిమిషాల వరకు ఉంచి తర్వాత దింపి ఒక బౌల్లోకి సర్వో చేసుకోవటమే అంతే ఎంత సింపుల్గా వెజ్ దమ్ బిర్యాని రెడీ.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది