Gongura Mutton Curry : గోంగూరతో పాతకాలం వంట చాలా రుచికరమైన గోంగూర మటన్ సంకటి ఈ కాంబినేషన్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సంకటిలోకి కాకుండా చపాతి, పూరి, వేడివేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. మరి గోంగూర మటన్ ని ఎలా తయారు చెసుకొవాలొ చూద్దాం..దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ట ఎర్ర గోంగూర. టమోటాలు, పచ్చిమిరపకాయలు, మటన్ ఒక టేబుల్ స్పూన్ గసాలు, కొద్దిగా చక్క, అయిదారు లవంగాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొబ్బరి ముక్కలు కరివేపాకు, పసుపు పొడి, ధనియాలపొడి, కారంపొడి, సాల్ట్ దీని తయారీ విధానం : ముందుగా మనం గోంగూరని ఉడికించి పెట్టుకోవాలి. ఒక పెనం తీసుకొని కడిగిన గోంగూర అంతా ఇందులో వేసుకొని అందులోనే మనం తీసుకున్న ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్న రెండు టమోటాలు కూడా ముక్కలు కట్ చేసేసి వేసుకోవాలి.
ఒక చిన్న టీ గ్లాస్ నుండా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మసాలా దినుసులు అన్ని ఇందులో వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఎండు కొబ్బరి, అలాగే తొక్క తీసేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నీళ్ళు లేకుండా ముందు ఒకసారి మిక్సీ వేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని దీన్నంతా ఈ విధంగా మనం మెత్తగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకున్న ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. తర్వాత కుక్కర్లో తీసుకొని ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు మూడు కాడలు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాతమటన్ వేసుకోవాలి.
వెంటనే మనం ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి కాసేపు వాటిని కలుపుతూ ఉంటే మటన్ మంచి రుచిగా ఉంటుంది. ఇందులో నీళ్లన్నీ ఎగిరిపోయి వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇదే సమయంలోనే మనం ఇందులో కారం ,ధనియాల పొడి వేసేసుకోవాలి. కారంపొడి మూడు టీ స్పూన్ల అయితే సరిపోతుంది. గోంగూర మటన్ కదండి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. చివర్లో మళ్ళీ కారం సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కూడా మూడు టీ స్పూన్లు వేసుకావాలి. మరో నాలుగు నిమిషాల పాటు మాకు కలుపుదం నీళ్లన్నీ విగిరిపోయాయి కదా ఈ టైం లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఇలా మసాలా వేసుకుంటే గోంగూర పులుపు అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది. మసాలా వేసిన తర్వాత దీన్నంతా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాలు మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మటన్ ఉడికేంతవరకు మనం ఉడికించుకోవాలి. మసాలా రుబ్బుకున్న మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసేసి ఆ మసాలా అంత వేస్ట్ కాకుండా వేసేసుకున్న తర్వాత తగిన నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టేసి మటన్ బాగా ఉడికేంత వరకు ఆరు ఏడు విజిల్స్ వచ్చేంతవరకు. మటన్ ను బట్టి ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఉడికించున గోంగూరమంత మెత్తగా పేస్ట్ చేసేది మెత్తగా అనిపిస్తుంది.
కూర అంత బాగా చిక్కబడితుంది.అలాగే మటన్ కూడా ఉడికిపోయింది మటన్ ఉడికిన తర్వాత మనం గోంగూర ఇందులో కలుపుకోవాలండి లేదంటే మటన్ అస్సలు ఉడకదు ఇప్పుడు మనం మెత్తగా చేసుకున్న గోంగూర అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మనం ఈ గోంగూరతో పాటు ఒక అయిదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మటన్ ఉడికించుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న గోంగూరంతా మటన్కి కూడా పట్టి మటన్ చాలా రుచిగా ఉంటుంది గోంగూర మటన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చివర్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాం. సరిపోకపోతే ఈ టైం లో ఉప్పు కారం వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా తక్కువైనాయండి నేను ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి బాగా నాలుగైదు నిమిషాలు బాగా గోంగూరతో పాటు ఉడికించుకుంటున్నాను ఈ టైం లోనే మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి నాలుగు ఐదు నిమిషాలు ఉడికించుకుందామ్… ఈ గోంగూర మటన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కదా అంతే అండి ఇలా నాలుగు నిమిషాలు మనం గోంగూరతో పాటు మటన్ ఉడికించుకున్నారు కదా కలుపుకుంటే చూశారు కదా ఇలా చిక్కగా మనకి కూర రెడీ అయిపోతుంది.
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
This website uses cookies.