Gongura Mutton Curry : రాగి సంగటి, గోంగూర మటన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gongura Mutton Curry : రాగి సంగటి, గోంగూర మటన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్…!

Gongura Mutton Curry : గోంగూరతో పాతకాలం వంట చాలా రుచికరమైన గోంగూర మటన్ సంకటి ఈ కాంబినేషన్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సంకటిలోకి కాకుండా చపాతి, పూరి, వేడివేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. మరి గోంగూర మటన్ ని ఎలా తయారు చెసుకొవాలొ చూద్దాం..దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ట ఎర్ర గోంగూర. టమోటాలు, పచ్చిమిరపకాయలు, మటన్ ఒక టేబుల్ స్పూన్ గసాలు, కొద్దిగా చక్క, అయిదారు లవంగాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2022,7:30 am

Gongura Mutton Curry : గోంగూరతో పాతకాలం వంట చాలా రుచికరమైన గోంగూర మటన్ సంకటి ఈ కాంబినేషన్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సంకటిలోకి కాకుండా చపాతి, పూరి, వేడివేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. మరి గోంగూర మటన్ ని ఎలా తయారు చెసుకొవాలొ చూద్దాం..దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ట ఎర్ర గోంగూర. టమోటాలు, పచ్చిమిరపకాయలు, మటన్ ఒక టేబుల్ స్పూన్ గసాలు, కొద్దిగా చక్క, అయిదారు లవంగాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొబ్బరి ముక్కలు కరివేపాకు, పసుపు పొడి, ధనియాలపొడి, కారంపొడి, సాల్ట్ దీని తయారీ విధానం : ముందుగా మనం గోంగూరని ఉడికించి పెట్టుకోవాలి. ఒక పెనం తీసుకొని కడిగిన గోంగూర అంతా ఇందులో వేసుకొని అందులోనే మనం తీసుకున్న ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్న రెండు టమోటాలు కూడా ముక్కలు కట్ చేసేసి వేసుకోవాలి.

ఒక చిన్న టీ గ్లాస్ నుండా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మసాలా దినుసులు అన్ని ఇందులో వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఎండు కొబ్బరి, అలాగే తొక్క తీసేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నీళ్ళు లేకుండా ముందు ఒకసారి మిక్సీ వేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని దీన్నంతా ఈ విధంగా మనం మెత్తగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకున్న ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. తర్వాత కుక్కర్లో తీసుకొని ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు మూడు కాడలు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాతమటన్ వేసుకోవాలి.

very tasty and easy Gongura Mutton Curry

very tasty and easy Gongura Mutton Curry

వెంటనే మనం ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి కాసేపు వాటిని కలుపుతూ ఉంటే మటన్ మంచి రుచిగా ఉంటుంది. ఇందులో నీళ్లన్నీ ఎగిరిపోయి వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇదే సమయంలోనే మనం ఇందులో కారం ,ధనియాల పొడి వేసేసుకోవాలి. కారంపొడి మూడు టీ స్పూన్ల అయితే సరిపోతుంది. గోంగూర మటన్ కదండి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. చివర్లో మళ్ళీ కారం సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కూడా మూడు టీ స్పూన్లు వేసుకావాలి. మరో నాలుగు నిమిషాల పాటు మాకు కలుపుదం నీళ్లన్నీ విగిరిపోయాయి కదా ఈ టైం లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఇలా మసాలా వేసుకుంటే గోంగూర పులుపు అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది. మసాలా వేసిన తర్వాత దీన్నంతా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాలు మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మటన్ ఉడికేంతవరకు మనం ఉడికించుకోవాలి. మసాలా రుబ్బుకున్న మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసేసి ఆ మసాలా అంత వేస్ట్ కాకుండా వేసేసుకున్న తర్వాత తగిన నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టేసి మటన్ బాగా ఉడికేంత వరకు ఆరు ఏడు విజిల్స్ వచ్చేంతవరకు. మటన్ ను బట్టి ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఉడికించున గోంగూరమంత మెత్తగా పేస్ట్ చేసేది మెత్తగా అనిపిస్తుంది.

కూర అంత బాగా చిక్కబడితుంది.అలాగే మటన్ కూడా ఉడికిపోయింది మటన్ ఉడికిన తర్వాత మనం గోంగూర ఇందులో కలుపుకోవాలండి లేదంటే మటన్ అస్సలు ఉడకదు ఇప్పుడు మనం మెత్తగా చేసుకున్న గోంగూర అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మనం ఈ గోంగూరతో పాటు ఒక అయిదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మటన్ ఉడికించుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న గోంగూరంతా మటన్కి కూడా పట్టి మటన్ చాలా రుచిగా ఉంటుంది గోంగూర మటన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చివర్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాం. సరిపోకపోతే ఈ టైం లో ఉప్పు కారం వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా తక్కువైనాయండి నేను ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి బాగా నాలుగైదు నిమిషాలు బాగా గోంగూరతో పాటు ఉడికించుకుంటున్నాను ఈ టైం లోనే మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి నాలుగు ఐదు నిమిషాలు ఉడికించుకుందామ్… ఈ గోంగూర మటన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కదా అంతే అండి ఇలా నాలుగు నిమిషాలు మనం గోంగూరతో పాటు మటన్ ఉడికించుకున్నారు కదా కలుపుకుంటే చూశారు కదా ఇలా చిక్కగా మనకి కూర రెడీ అయిపోతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది