Victor Noir | జర్నలిస్టు సమాధికి మహిళలు ముద్దులు.. వింత నమ్మకంకి కారణం ఏంటి?
Victor Noir | ప్రపంచం చరిత్రలో ప్రముఖ జర్నలిస్టుగా నిలిచిన విక్టర్ నొయిర్ సమాధి ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఓ విభిన్న విశ్వాసానికి కేంద్రమైంది. ఈ సమాధి వద్ద ఉండే విగ్రహానికి మహిళలు బారులు తీరుతూ ముద్దులు పెడుతున్నారు. కారణం – అలా చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్న నమ్మకం.
#image_title
విగ్రహం వద్ద ముద్దు పెట్టడం..
విక్టర్ నొయిర్ కాంస్య విగ్రహం, ఆయన హత్యకు గురైన సమయంలో నేలపై పడిన విధంగా రూపొందించబడింది. ఎంతో సహజంగా, తల వద్ద టోపీ పడి ఉన్నట్టు, ఆయన శరీర స్థితిని ప్రతిబింబించేలా ఉన్న ఈ విగ్రహానికి తొలుత ప్రజలు నివాళులుగా ముద్దులు పెట్టేవారు. కానీ కొన్ని ఘటనల నేపథ్యంలో, ఇలా ముద్దు పెట్టిన మహిళల్లో కొందరు గర్భం దాల్చినట్లు ప్రచారం జరగడంతో, ఈ స్థలం తక్షణమే ‘ఫెర్టిలిటీ పవర్’ ఉన్న ప్రదేశంగా మారిపోయింది.
విక్టర్ నొయిర్ అనేది అసలు పేరు కాదు – ఇది వైవన్ సాల్మన్ అనే జర్నలిస్టు కలం పేరు. ఆయన 19వ శతాబ్దంలో రాచరిక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డ సమకాలీన రచయిత. 1870లో అప్పటి చక్రవర్తి మూడో నెపోలియన్ బంధువు ప్రిన్స్ పియర్ బోనపార్టే తుపాకీతో కాల్చి చంపారు. ఆయన హత్య ఫ్రాన్స్‌ను కుదిపేసింది. లక్షలాది మంది ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరై, రాచరికానికి వ్యతిరేకంగా గళం విప్పారు.