Home » Exclusive » Video Calls To Girls In The Name Of Weight Loss Recorded Full Details
Exclusive

Video Calls : వెయిట్ లాస్ పేరుతో అమ్మాయిలకు వీడియో కాల్స్.. రికార్డ్ చేసేసింది.. ఫుల్ డీటెయిల్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 5, 2023, 7:00 pm
Advertisement

Video Calls : ప్రస్తుత రోజుల్లో సన్నబడటానికి రకరకాల మందులు వాడుతున్నారు. దీని కాస్ట్ చేసుకొని ఓ ప్రబుద్ధుడు తన శరీర కోరికలు తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఓ ధైర్యవంతురాలు… అడ్డుకోవడం జరిగింది. ఆ కీచకుడుని పోలీసులకు అప్పగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కూకట్ పల్లిలో వెయిట్ లాస్ పేరుతో ఓ కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. దీంతో కొంతమంది లేడీస్ ఆ కంపెనీకి వెళ్లి తమ డీటెయిల్స్ తెలియజేయడం జరిగింది. ఫోన్ నెంబర్లతో పాటు తమకి కావలసిన ప్రోడక్ట్ అన్ని విషయాలు సదరు కంపెనీకి ఇవ్వడం జరిగింది.

Advertisement

అయితే ఆ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న వక్కపట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి… వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోరే మహిళలతో మంచి జడలు మాట్లాడేవాడు. కంపెనీ అందించే సేవలు వివరించేవాడు. ఏ ప్రోడక్ట్ మెడిసిన్ వాడితే త్వరగా వెయిట్ లాస్ అవ్వోచ్చో వాటి గురుంచి  తెలియజేసేవాడు. ఇక మందులు వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతానని సదరు మహిళల నుండి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. ఈ రకంగా దాదాపు పాతికమంది మహిళల ఫోన్ నెంబర్లు చంద్రశేఖర్ వద్ద ఉన్నాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళలకు.. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ…

video calls to girls in the name of weight loss recorded full details

Advertisement

బట్టలు లేకుండా.. చాలా నీచాతి నీచంగా ప్రవర్తించటం స్టార్ట్ చేసాడు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు ఆ కాల్స్ కట్ చేయగా.. మరి కొంతమంది మానసిక క్షోభకు గురయ్యేవారు. చంద్రశేఖర్ బాధ తట్టుకోలేక మరి కొంతమంది ఫోన్ నెంబర్ లు మార్చేసుకోవడం జరిగింది. తాజాగా ఓ ధైర్యవంతురాలు చేతిలో చంద్రశేఖర్ పాపం పండింది. ఇతడి న్యూడ్ కాల్స్ కు విసిగిపోయిన ఓ మహిళ ఆ కాల్స్ రికార్డ్ చేసి… తీసుకెళ్లి స్థానిక కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీంతో పోలీసులు చంద్రశేఖర్ పై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి