Video Leak Episode, Gorantla Madhav Gets Reliefe, As Expected
Gorantla Madhav : న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి ఊరట లభించింది. ప్రచారంలో వున్న వీడియో ఒరిజినల్ కాదని పోలీసులు తేల్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామనీ, వీడియో యూకేలో తొలుత పోస్ట్ అయ్యిందని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఫోన్‌లో వీడియో ప్లే అవుతుండగా, ఎవరో దాన్ని మరో ఫోన్ ద్వారా వీడియో తీశారనీ, దాంతో ఒరిజినల్ వీడియో వుందా.? వుంటే, దాని పరిస్థితి ఏంటి.? అనేది తేల్చడానికి వీలు పడదని ఫకీరప్ప పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ప్రచారంలో వున్న వీడియో ఒరిజినల్ కాదని మాత్రం చెప్పగలమని ఫకీరప్ప పేర్కొన్నారు..
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పని చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా పని చేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఆ సమయంలో పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పరస్పరం సవాళ్ళ పర్వం కూడా నడిచింది. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా పతనమైతే, రాజకీయాల్లో అనూహ్యంగా ఎదిగారు గోరంట్ల మాధవ్.
ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఎదుగుదలను ఓర్వలేకనే టీడీపీ ఇదంతా చేయించిందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రచారంలో వున్న వీడియో ఒరిజినలా.? కాదా.? అన్నది తేలకుండానే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా నానా యాగీ చేశాయి.
Video Leak Episode, Gorantla Madhav Gets Reliefe, As Expected
ఈ క్రమంలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికార పార్టీ సంయమనం పాటించింది. ఇదిలా వుంటే, ఎస్పీ ఫకీరప్ప వివరణపైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా, పలువురు టీడీపీ నేతలు చిత్ర విచిత్రమైన భాష్యాలు చెబుతున్నారు. ‘ఎస్పీ ఎవరు అది ఫేక్ అని చెప్పడానికి..’ అంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తుండడం గమనార్హం.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.