
Vijayasai Reddy Tweets on TDP Mind Block
Vijayasai Reddy : ఒకదాని తర్వాత ఇంకో ట్వీటు.. ఒకదాన్ని మించి ఇంకో ట్వీటు.. ఇలా సాగుతోంది వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ల ప్రవాహం. అన్నీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పైకే సంధించబడుతున్నాయ్. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చంద్రబాబు వైఫల్యాలు, ప్రస్తుతం టీడీపీ స్థాయి దిగజారిపోయిన వైనం, స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వ్యవహారం.. ఇలా దేన్నీ విజయసాయిరెడ్డి వదిలిపెట్టడంలేదు. ఈ ట్వీట్ల సునామీ ఓ వైపు, ఇంకో వైపు.. వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రని ప్రమోట్ చేస్తూ వేస్తున్న ట్వీట్లు ఇంకో వైపు..
వెరసి వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు విజయసాయిరెడ్డి. అదే సమయంలో, టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా గింజుకుంటూ, విజయసాయిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఓ వ్యూహం ప్రకారం ట్విట్టర్‌లో ఆయా అంశాలపై ట్వీట్లు వేస్తుంటారు. వాటిపై సహజంగానే టీడీపీ మద్దతుదారుల నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చి పడుతుంటుంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు విజయసాయిరెడ్డి. ఎందుకంటే, ఇలాంటి ట్వీట్లు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
Vijayasai Reddy Tweets on TDP Mind Block
సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ విజయసాయిరెడ్డి ట్వీట్లకు మంచి రెస్పాన్స్ లభిస్తుంటుంది. విజయసాయిరెడ్డి ట్వీట్ల గురించి చర్చోపచర్చలు నడుస్తుంటాయి. ఆయన కోరుకునేది కూడా అదే. అందుకే, పార్టీకి సంబంధించిన కీలక విభాగాలకు విజయసాయిరెడ్డిని బాధ్యుడిగా నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీకి మద్దతిచ్చే నెటిజన్లలో ఉత్సాహం తగ్గిందని అనిపించినప్పుడల్లా ఒక్క ట్వీటుతో వారిలో కొత్త ఉత్సాహం నింపడం విజయసాయిరెడ్డికే చెల్లింది. అదే సమయంలో, ప్రత్యర్థులు విజయసాయిరెడ్డి ట్వీట్లకు చిత్తయిపోవడం కూడా చూస్తూనే వుంటాం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.