Viral News : అంబులెన్స్ అంటే ప్రాణాలను కాపాడే వైద్య వాహనం అన్న విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గుర్తుచేది అంబులెన్స్.. ఎవరికైనా ప్రమాదం జరగగానే 108 కి డయల్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వాహనం ఎంతో మంది ప్రాణాలను రక్షించింది. చావు నుంచి తప్పించి ఎన్నో కుటుంబాలు వెలుగును నింపింది. అలాగే ప్రసవాలు కూడా చేసి తల్లి బిడ్డలను కాపాడింది. ఇలా చాలామంది జీవితాలలో సెకండ్ లైప్ ఇచ్చిన అంబులెన్స్ ఒక మహిళ విషయంలో మాత్రం 13 సంవత్సరాలు నుండి ఆమెను శకటంలా వెంటాడుతూనే ఉంది.
ఇక చివరికి అదే అంబులెన్స్ ఆమె ప్రాణాలు తీసింది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన వరంగల్ జిల్లాలో ఇదే సంఘటన జరిగింది. 2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ 108 వాహనాలను ప్రారంభించిన కొత్తలో దాంట్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఈఎంటిగా జాయిన్ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల కు చెందిన సిద్ది మల్ల స్వప్న. ఈమె విధుల్లో చురుగ్గా ఉండటంతో స్వప్నకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి. అంబులెన్స్ వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు బద్దలు కొట్టింది. అయితే 2010లో అంబులెన్స్ వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద నిధులు నిర్వహిస్తుండగా.. ప్రమాదం జరిగిందన్న సమాచారంతో ఘటన స్థలానికి వాహనంతో పాటు బయలుదేరింది బృందం. ఆ టైంలో హాసనరి రోడ్లో అంబులెన్స్ వాహనానికి ప్రమాదం జరగడంతో స్వప్నకు త్రీవ్ర గాయాలు అయ్యాయి.
స్వప్నను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ కూడా జరిగింది. స్వప్న పూర్తిగా కోలు కోల్పోయినప్పటికీ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యానికి ఖర్చుని దృష్టిలో ఉంచుకొని మళ్లీ విధుల్లో జాయిన్ అయింది. కరోనా టైం లో కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేసింది. స్వప్న ఇక అంతలో మరో ప్రమాదం 2021 లో పరకాలలో అంబులెన్స్ వాహంలో పనిచేస్తున్న స్వప్న ఓ క్షతగాత్రున్ని ఎంజీఎం కు అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. అప్పుడు మళ్లీ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ వాహనం స్వప్న మరోసారి ఆస్పత్రిపాలైంది. ఇక అప్పటినుంచి ఆమె మంచానికి పరిమితం అయిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారటంతో సాటి ఉద్యోగులు కొంత డబ్బు సహాయం అందించారు. దాంతో తాను పనిచేసిన అదే వాహనంలో హైదరాబాదుకి ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ వైద్యులు ఎంతో ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక స్వప్న ఆదివారం నాడు మరణించింది. ఎన్నో ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ స్వప్న ప్రాణాలు తీసింది..
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.