Home » News » Viral News Bride Runs Away With Bridegroom Before Wedding
News

Viral News : ఇంకో వారంలో పెళ్లి.. ఇంతలో వరుడితోనే లేచిపోయిన వధువు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు?

Authored By
aruna
The Telugu News | Published on: August 7, 2022, 10:00 pm
Advertisement

Viral news : ఇంకో వారంలో అతడి పెళ్లి. పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పెళ్లి కొడుకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ.. ఇంతలోనే వారంలో పెళ్లి ఉందనగానే పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకుకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏకంగా కాబోయే వరుడితోనే వధువు లేచిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి.

Advertisement

ఎవ్వరికీ తెలియకుండా తనకు కాబోయే వరుడిని వారం రోజుల ముందే లేపుకువెళ్లింది ఓ యువతి. ఈ ఘటనతో పెళ్లి కొడుకు కూడా షాక్ అయ్యాడు. ఇంకో వారం ఆగితే అందరు బంధువుల సమక్షంలో పెళ్లి జరిగేది కదా అని వరుడు చెప్పినా వినకుండా అతడితో లేచిపోయింది ఆ యువతి.

Viral News : తన సోదరి వల్లనే ఇదంతా చేసిన యువతి

తనకు కాబోయే భర్తకు తన సోదరి లైన్ వేస్తోందని, తనకు ప్రపోజ్ చేయబోతోందని ఆ యువతి తెలుసుకుంటుంది. దీంతో తనకు కాబోయే భర్తను తన సోదరికి దక్కకుండా చేసేందుకు ఆ యువతి ఇలా చేసింది. తనకు కాబోయే భర్తకు ఈ విషయం తెలియదని, ఒకవేళ తనకు కాబోయే వరుడికి తన సోదరి ప్రపోజ్ చేస్తే తనను కాదని, అతడు తన సోదరిని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో అని అనుకొని వెంటనే తనకు కాబోయే వరుడితో లేచిపోయింది. ఈ విషయం మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది సదరు యువతి.

Advertisement

Viral News Bride runs away with bridegroom before wedding

అంతేకాదు.. తన భర్తతో హనీమూన్ కు కూడా వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది ఆ యువతి. తమ ఫ్రెండ్స్, కొందరు బంధువుల సమక్షంలో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కు కూడా ప్లాన్ చేసుకున్నాం అని ఆ యువతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తన పెళ్లి గురించి షేర్ చేసింది. తన పెళ్లి కోసం తను చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆ యువతి ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి