Viral News : కొడుకు చ‌నిపోయిన త‌ర్వాత కోడ‌లి ఫోన్ చూసిన మామ‌.. . వెలుగులోకి భయంకర నిజం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral News : కొడుకు చ‌నిపోయిన త‌ర్వాత కోడ‌లి ఫోన్ చూసిన మామ‌.. . వెలుగులోకి భయంకర నిజం

Viral News : నిజం నిప్పులాంటిది.. ఎప్పుడైన భ‌య‌ప‌డ‌కుండా ఉండ‌దు. ఓ తండ్రి తన కొడుకుది సహజమరణం కాదని.. ఏదో మిస్టరీ దాగుందని అనుమానించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఊహించని నిజాలుతెలిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అక్బర్‌ ఆజాం మర్డర్ మిస్టరీ వీడింది. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలే వెలుగుచూశాయి. మత్తుమందును ఎక్కువ డోసులో ఇవ్వడం వల్లే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. కట్టుకున్న భార్యే అతణ్ని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 August 2022,8:00 am

Viral News : నిజం నిప్పులాంటిది.. ఎప్పుడైన భ‌య‌ప‌డ‌కుండా ఉండ‌దు. ఓ తండ్రి తన కొడుకుది సహజమరణం కాదని.. ఏదో మిస్టరీ దాగుందని అనుమానించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఊహించని నిజాలుతెలిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అక్బర్‌ ఆజాం మర్డర్ మిస్టరీ వీడింది. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలే వెలుగుచూశాయి. మత్తుమందును ఎక్కువ డోసులో ఇవ్వడం వల్లే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. కట్టుకున్న భార్యే అతణ్ని కడతేర్చినట్టు తేల్చారు పోలీసులు.

Viral News : మిస్ట‌రీ వీడింది..

భార్య అహ్మదున్నీసా బేగంతో పాటు, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను కటకటాల్లోకి పంపారు. ఈ ఏడాది జూన్‌ 23న అజాం చనిపోయాడు. అంటే ఘటన జరిగి రెండు నెలలు కావస్తోంది. అప్పుడంతా అతనిది సహజ మరణంగానే భావించారు. అలా నమ్మించడంలో అప్పటికి సక్సెస్‌ అయ్యారు నిందితులు. మామూలుగానే అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ, ఆ తర్వాత అజాం తండ్రి హుస్సేన్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది మామూలు మరణం కాదనీ… ప్రి ప్లాన్డ్‌ మర్డర్‌ అని నిర్ధారించారు పోలీసులు. కోడలు.. తమ అపార్ట్ మెంట్లోనే ఉండే రాజేష్ జైన్, కిరణ్ అనే యువకులతో మాట్లాడిన మాటలు ఫోన్లో రికార్డయ్యాయి. దీంతో ఆరా తీయగా..

Viral News Whatsapp Chat Helps Unearth Andhra Public Prosecutor

Viral News Whatsapp Chat Helps Unearth Andhra Public Prosecutor

అహ్మదున్నీసా బేగంకు వాళ్లిద్దరితో ఎఫైర్ ఉన్నట్లు తేలిసింది. తమ సుఖానికి అడ్డొస్తున్నాడనే కోపంతో.. జూన్ 23న అక్బర్ ఆజాంకు నిద్రమాత్రలు ఇచ్చింది. అతను నిద్రలోకి జారుకోగానే.. కిరణ్ ను పిలించింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్లకార్ క్లోరోఫామ్ తెచ్చిన కిరణ్.. అక్బర్ ఆజాం ముక్కుకు అదిమిపట్టుకున్నాడు. దీంతో అతడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఈ మర్డర్ కు రాజేష్ జైన్ బయట నుంచి కాపలా కాశాడు. పోలీసులు అహ్మదున్నీసాతో పాటు రాజేష్, కిరణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించాడు. అక్రమ సంబంధం కోసమే భర్తను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది .59 రోజుల తర్వాత మర్డర్ మిస్టరీని ఛేదించిన కాకినాడ ఖాకీలు… అహ్మదున్నీసా, కిరణ్‌, రాజేష్‌ జైన్‌లను కటకటాల వెనక్కి నెట్టారు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది