Viral Video : చిన్నప్పుడు ఈ టైర్ల ఆట ఆడారా? ఈ పిల్ల‌లు ఇప్పుడు ఎలా ఆడారో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : చిన్నప్పుడు ఈ టైర్ల ఆట ఆడారా? ఈ పిల్ల‌లు ఇప్పుడు ఎలా ఆడారో చూడండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 July 2021,11:08 am

Viral Video : చిన్నప్పటి రోజులే వేరు. చిన్నతనంలో చాలామంది ఎన్నో ఆటలు ఆడుతారు. వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు రావడం ఖాయం. ఎందుకంటే.. అవి అంతలా నవ్వు తెప్పిస్తాయి. టైర్లతో ఆడటం, గోళీలాట ఆడటం, పత్తాలు, పిక్కలు, అష్టాచెమ్మా, తొక్కుడు బిళ్ల.. ఇలా పలు రకాల ఆటలను ఫ్రెండ్స్ తో కలిపి ఆడేవారు. అయినా చిన్నప్పటి రోజులే వేరు. ఈ జనరేషన్ మారింది. అప్పట్లో చిన్నతనం అంటే ఎక్కువగా ఇవ్వే ఆటలు. కానీ.. నేటి జనరేషన్ పిల్లలు స్మార్ట్ ఫోన్లను పట్టుకొని ఆడుతున్నారు.

viral video of child playing with tyre

viral video of child playing with tyre

ఇక.. అసలు విషయానికి వస్తే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక పిల్లాడు టైర్ తో ఆటే ఆట అది. అది చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ ఆటను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు అటువంటి ఆటను ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడారా? గుర్తు చేసుకోండి ఒకసారి. మామూలుగా టైర్ ఆట అంటే.. టైర్ ను ఓ కర్రతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఈ ఆటను చాలామంది ఆడి ఉంటారు. కానీ.. ఈ ఆటను మాత్రం అస్సలు ఆడి ఉండరు.

Viral Video : టైర్ లోపల కూర్చొని ఈ పిల్లాడు ఏం చేశాడో తెలుసా?

ఓ పిల్లాడు టైర్ లోపల కూర్చొని.. రోడ్డు మీద వంపు ఉన్న ప్రాంతంలో నుంచి అలాగే.. కిందికి దొర్లుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత తన కాళ్లతో మళ్లీ అలాగే రివర్స్ లో వచ్చాడు. మనోడు చేస్తున్న స్టంట్ చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తుంటే తమ చిన్నతనం గుర్తుకు వస్తోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి.. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి మీ చిన్నతనం గుర్తుకు వస్తోందో చూడండి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది