Tomatoes : టమాటాలు తింటే క్యాన్సర్ రాదా? నిపుణులు ఏమంటున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tomatoes : టమాటాలు తింటే క్యాన్సర్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 July 2021,9:40 pm

Tomatoes : టమాటాలు.. లేకుంటే ఏ కూర వండలేం. ఏ కూర వండినా.. అందులో టమాట ఉండాల్సిందే. టమాట కూర, టమాట పచ్చడి, టమాట చారు.. ఇలా టమాటతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం. అసలు.. టమాట లేకపోతే రోజే గడవదు. అది టమాటకు మనం ఇచ్చే విలువ. అయితే.. టమాట టేస్ట్ గా ఉంటుందని మనం అన్ని కూరల్లో వాడుతుంటాం. కానీ.. మనకు తెలియకుండానే.. టమాటను ప్రతి వంటల్లో తిని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నాం.

tomatoes health benefits telugu

tomatoes health benefits telugu

టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమాటాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. టమాటాలను నిత్యం తీసుకుంటే.. ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే.. చాలామంది టమాటాలను తింటే క్యాన్సర్ రాదని నిక్కచ్చిగా చెబుతుంటారు. మరి.. నిజంగా టమాటాలను తింటే క్యాన్సర్ రాదా? టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Tomatoes : టమాటాలు క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతాయి

టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే.. టమాటాల్లో పొటాషియం ఉంటుంది. అయితే.. టమాటాల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. పొటాషియంతో పాటు.. మెగ్నీషియం, కాల్షియం, పాస్ఫరస్, కాపర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

tomatoes health benefits telugu

tomatoes health benefits telugu

గుండె సమస్యలు ఉన్నవాళ్లు, హైబీపీ ఉన్నవాళ్లు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు.. టమాటాలను ఖచ్చితంగా తినాల్సిందే. టమాటాలలో ఉండే.. కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగు పడాలన్నా.. రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచాలన్నా టమాటాలను తినాల్సిందే.

tomatoes health benefits telugu

tomatoes health benefits telugu

టమాటాలను నిత్యం తీసుకోవడం వల్ల.. అది శరీరంలో ఏర్పడే క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. చాలామందికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలంటే.. టమాటాలను తినాల్సిందే. టమాటాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ప్రీ రాడికల్స్ తో పోరాడి.. వాటిని నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. టమాటాల వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా పెరుగుతుంది. జుట్టు పెరగాలన్నా.. దృఢంగా మారాలన్నా.. టమాటాలను తినాల్సిందే. ముఖంలో గ్లో కావాలన్నా.. చర్మం నిగారింపు రావాలన్నా.. టమాటాలను తినాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపి ఉన్న‌వారు ఉప్పుకు బ‌దులు ఇవి వాడండి.. ?

ఇది కూడా చ‌ద‌వండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది