Home » News » Viral Video There Are No Legs And Hands This Boys Talent Has To Be Admired
News

Viral Video : కాళ్లు చేతులు లేకపోయినా ఈ బాలుడి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే!

Authored By
aruna
The Telugu News | Published on: August 3, 2022, 9:40 pm
Advertisement

Viral Video : ఈ భూమిపైకి వచ్చిన ప్రతిజీవి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే, మనిషి పుట్టుక విషయానికొస్తే కొందరు అసాధారణ టాలెంట్‌ను కలిగియుంటే మరికొందరు మాత్రం తమలోని శక్తిని గుర్తించేందుకు సమయం తీసుకుంటుంటారు. ఆ టాలెంట్‌ను గుర్తించిన సమయంలో దానికి పదును పెడితే అతనికి ఇక జీవితంలో తిరుగుండదు. తను సాగుతున్న బాటలో ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చిన వాటిని తట్టుకుని తన ప్రయాణం సాగిస్తుంటాడు. కానీ కొందరు మాత్రం తమలోని శక్తిని గుర్తించలేక జీవితం తలకిందులు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

Advertisement

అన్ని అవయవాలు బాగా పనిచేసే సాధారణ మానవుడితో పోలిస్తే వికలాంగుల జీవితం చాలా కష్టం. కానీ వారు ఇటీవల కాలంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. దేవుడు వారికి అంగవైకల్యం ఇచ్చినా కానీ బుద్ది బలం మాత్రమే తోటి వారితో పోలిస్తే కొద్దిగా ఎక్కువే ఇస్తాడని కొందరు అంటుంటారు. అందుకేనేమో దివ్యాంగులు వారి వైకల్యం వారికి మైనస్ కాకూడదని చాలా ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం తపిస్తుంటారు. అందుకోసం వారిలో దాగియున్న టాలెంట్‌ను బయటకు తీసి నలుగురితో శభాష్ అనిపించుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కాళ్లు చేతులు లేని ఓ బాలుడి టాలెంట్‌‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video there are no legs and hands, this boy’s talent has to be admired!

Advertisement

Viral Video : డ్రాయింగ్ అదుర్స్‌..

ఖాళీ పేపర్ పై పరమశివుడి బొమ్మను నోటితో గీసి అందరి మన్ననలు పొందుతున్నాడు. బొమ్మ గీస్తున్నంత సేపు అతని దృష్టి అంతా డ్రాయింగ్ పైనే ఉంది. ఎవరి సాయం కూడా తీసుకోలేదు. సొంతంగా బొమ్మ గీసి డ్రాయింగ్‌లో అతనికున్న అసాధారణ ప్రతిభను బాహ్య ప్రపంచానికి చూపించాడు. దీంతో అందరూ ఆ బాలుడిని మెచ్చుకుంటున్నారు. ఇలా అంగవైకల్యంతో బాధపడేవారికి ఆయా స్థానిక ప్రభుత్వాలు కూడా తోడ్పాడు అందించడం వలన వారు జీవితంలో తమ గోల్‌ను రీచ్ అవడానికి ఆస్కారముంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా, బాలుడి అద్భుతమైన పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి