Kohli- Anushka Sharma | భార్యతో సరదాగా వీధుల్లో తిరుగుతున్న కోహ్లీ.. ఆ బాధలు నీకు తప్పలేదా అంటూ కామెంట్
Kohli- Anushka Sharma | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. టెస్టు మరియు టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో నడుచుకుంటూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోహ్లీకి కష్టాలు..
ఆ వీడియోలో విరాట్ చేతిలో గొడుగు, మరోచేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని కనిపించగా, అనుష్క ఆకుపచ్చ రంగు హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించింది. ఇద్దరూ ఇద్దరు విదేశీయులతో హాస్యం పంచుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు చురుకుగా స్పందిస్తూ, “ఏ స్థాయి స్టార్ అయినా భార్యతో బయటకు వస్తే ముందుజాగ్రత్తలు తప్పవు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
భారతదేశంలో అయితే అభిమానుల ముట్టడి తప్పదని, విదేశాల్లో మాత్రం తామూ సాధారణ ప్రజలానే స్వేచ్ఛగా తిరుగవచ్చని కోహ్లీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. షాపింగ్ చేయడం, వీధుల్లో నడవడం వంటి విషయాలు అక్కడ సాధ్యమవుతాయని పేర్కొన్నాడు.టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున ఆడాడు.తర్వాత ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత మైదానంలో కనిపించలేదు.ఇప్పుడు మళ్లీ అక్టోబర్‌లో జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో కోహ్లీ పాల్గొననున్నాడు.
VIRAT KOHLI & ANUSHKA SHARMA AT THE LONDON STREETS. ❤️
— Tanuj (@ImTanujSingh) August 17, 2025