B12 Boost | విటమిన్ B12 లోపానికి సులభ పరిష్కారం .. రూ.5కే లభించే అరటిపండు మంత్రం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

B12 Boost | విటమిన్ B12 లోపానికి సులభ పరిష్కారం .. రూ.5కే లభించే అరటిపండు మంత్రం

 Authored By sandeep | The Telugu News | Updated on :4 October 2025,7:30 am

B12 Boost | వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటి విటమిన్ B12 లోపం . శరీరానికి అత్యంత కీలకమైన ఈ విటమిన్ తగ్గితే అలసట, నరాల బలహీనత, రక్తహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా శాఖాహారుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

#image_title

ఇవి చేయండి..

ఈ లోపాన్ని సహజంగా తగ్గించడానికి ఒక సులభమైన మార్గం అందుబాటులో ఉంది. అదేంటంటే, మనకు సులభంగా దొరికే అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం. అరటిపండులో విటమిన్ B12 నేరుగా లేకపోయినా, శరీరం దానిని శోషించడానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అరటిపండులోని పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి విటమిన్ B12 శోషణకు సహాయపడతాయి.

అరటిపండుతో పాలను కలిపి తీసుకుంటే లోపం తగ్గడమే కాకుండా శక్తివంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. అరటిపండు ముక్కలు చేసి బ్లెండర్‌లో వేసి పాలు, చక్కెర కలిపి మెత్తగా మిక్స్ చేయాలి. కావాలంటే ఐస్ వేసి చల్లగా తాగవచ్చు. పెరుగు కూడా విటమిన్ B12 అధికంగా కలిగిన ఆహారం. అరటిపండు, పెరుగు కలిస్తే పోషక విలువలు మరింత పెరుగుతాయి. : పెరుగును బాగా చిలకాలి. చిన్న ముక్కలుగా కోసిన అరటిపండును వేసి కలపాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి చల్లగా సర్వ్ చేయాలి. కొత్తిమీర ఆకులు వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది