Vivo Drone Camera Phone : వివో నుంచి డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ రిలీజ్.. కొత్త చరిత్రే ఇది..!
Vivo Drone Camera Phone : ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో నుంచి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది.దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ కంపెనీ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇది మొబైల్ విపణిలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది మునుపెన్నడూ లేనివిధంగా ఫ్లైయింగ్ డ్రోన్ కెమెరాతో వస్తోంది. గాల్లో ఎగురుతూ ఫోటోలు షూట్ చేయగలదు. ఈ అద్భుతమైన ఫీచర్‌కు సంబంధించిన పేటెంట్ గురించి డబ్లూఐపీవో (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్)లో వివో కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. కొత్తగా వచ్చే స్మార్ట్‌ఫోన్‌కు ఉండే డ్రోన్ కెమెరా 200 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో రానుంది.
ఇప్పటివరకు చాలా కంపెనీలు ఈ ఫీచర్లతో మొబైల్ తీసుకురానున్నట్టు ప్రకటించినా వివో మాత్రం దీనిలో ముందడుగు వేసినట్టు సమాచారం. ఈ ఫోన్ కార్నిగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో వస్తుంది. 6.9 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేను కలిగి ఉంది. దీని కెమెరా రిజల్యూషన్ 1440 *3200 పిక్సెల్స్‌తో వస్తుంది. 32 మెగాపిక్సెల్స్ అల్డ్రా వైడ్ లెన్స్, 16 మెగా పిక్సెల్ వైడ్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.. 6900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 36 గంటలకు వరకు బ్యాటరీ ఉంటుంది.
256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో 12 జీబీ ర్యామ్‌తో రానుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 898 5జీ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌ఫ్రాడెడ్ సెన్సార్స్ అమర్చారు.దీని సాయంతో కెమెరా గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఇతర వస్తువులకు తాకకుండా ఇది భద్రత కల్పిస్తుంది. రాత్రుళ్లు కూడా దీని సాయంతో ఫోటోలు క్లారిటీగా తీసే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లాంచింగ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం తెలియలేదు. వచ్చే ఏడాది ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.