PF Money : మీ పీఎఫ్ డబ్బు మొత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేస్తే వెరీ సింపుల్..!
PF Money : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ జీవితకాలంలో సంపాదించిన డబ్బులో కొంత భాగం పీఎఫ్ కింద జమ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉద్యోగి భవిష్యత్ భద్రత కోసం ఈ నిధిని ఏర్పాటుచేశారు. ఉద్యోగి సంపాదనలో ప్రతినెలా వేతనంలో కొంత పీఎఫ్ కొంత కట్ అవుతే దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగి కంపెనీ కూడా కొంత డబ్బు యాద్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఉద్యోగి అత్యవసరాన్ని బట్టి పీఎఫ్ డబ్బును మధ్యలోనే తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఈ నగదును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈపీఎఫ్ ఖాతాదారులు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి ‘ఉమాంగ్ యాప్’ సాయంతో డబ్బును ఉపసంహరించుకోవచ్చని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెల్లడించింది. కరోనా అడ్వాన్స్ రూపంలో నగదును ఉపసంహరించుకోవచ్చని పేర్కొంది. కరోనా టైంలో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నందున ఉద్యోగులకు ఈపీఎఫ్ రుణాలు ఇస్తూ అకౌంట్ నుంచి కొంత మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. కరోనా చికిత్స కోసం కూడా ఈ నగదును వాడుకోవచ్చును.ముందుగా ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సెర్చ్ మెనూలోకి వెళ్లి లుక్ ఫర్ ఈపీఎఫ్ సర్వీసెస్‌లోకి వెళ్లాలి. ఎంప్లాయీ సెంట్రిక్‌ను ఎంచుకుని, రైజ్ క్లైమ్ పైన క్లిక్ చేసుకోవాలి.
PF Money : ఎలా విత్ డ్రా చేసుకోవాలి
ఈపీఎఫ్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.ఉపసంహరణ రకాన్ని పేర్కొని, ఉమాంగ్ యాప్ ద్వారా సబ్మిట్ చేయాలి. మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఉమాంగ్ ద్వారా డబ్బు తీసుకోవాలంటే ఇది తప్పనిసరి.. మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) కచ్చితంగా పాన్ తో లింక్ అవ్వాలి. ఫోన్ ఆధార్ కూడా లింక్ కావాలి. మీ ఉమాంగ్ యాప్ ఆధార్ నెంబర్‌తో లింక్ కావాలి. పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవడానికి ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కూతురు పెళ్లికోసం విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కనీసం 60నెలల కనీస అర్హత. 54ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ వారికి 90 శాతం అర్హత.