War 2 vs Coolie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న చిత్రం వార్ 2. ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్‌లో ఓ క్రేజీ సీక్వెల్. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 14న, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాకు పోటీగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఆ పాత్రపై ఫుల్ జోష్..
#image_title
వార్ 2లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపించనున్నారన్న వార్తలతోనే మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం వచ్చి, ఎన్టీఆర్ పాత్ర సినిమా స్టార్ట్ అయ్యాక 30 నిమిషాల తర్వాత వస్తుంది అనే ప్రచారం ఫ్యాన్స్‌ను కొంత నిరాశపరిచింది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ఎంట్రీ సినిమాలో 18వ నిమిషంలోనే ఉంటుందట. అంతేకాదు, ఫస్ట్ హాఫ్ మొత్తం తారక్ హైలెట్ కానుందని, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్‌లో గూస్‌బంప్స్ వచ్చే సీన్స్ ఉండనున్నట్లు టాక్. అలాగే సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ – హృతిక్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో అత్యుత్తమ హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
సినిమా క్లైమాక్స్ ఘట్టంలో రెండు పాత్రలకు మధ్య ఎదురెదురుగా వచ్చే తుపాన్ అద్భుతంగా తెరకెక్కించారని, ఇది థియేటర్‌లో మాసివ్ రెస్పాన్స్ తెచ్చేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. దీంతో గతంలో ‘ఎన్టీఆర్ నెగటివ్ షేడ్’ పాత్ర అని బాధపడిన అభిమానులు ఇప్పుడు సూపర్ హైప్ లోకి వెళ్లిపోయారు. ‘కూలీ’ సినిమాతో తలపడుతుండగానే, ‘వార్ 2’ బృందం ఎన్టీఆర్ ఫ్యాన్‌బేస్‌ను టార్గెట్ చేస్తూ మంచి పబ్లిసిటీ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలు కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #War2, #NTR200 అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్…
Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా…
Court Heroine Sridevi : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…
Good News : ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…
Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…
This website uses cookies.