Raghu Rama Krishna Raju : రఘురామ కృష్ణంరాజు పై ఏపీ ప్రభుత్వం పరువు నష్టం దావాకు సిద్దం
Raghu Rama Krishna Raju : వైకాపా జెండా నీడన గెలిచి.. జగన్మోహన్ రెడ్డి కి పున్న ఆదరణతో ఓట్లు దక్కించుకున్న పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గత కొన్నాళ్లుగా సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగర వేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చాలా చూస్తూ ఉంటాం. కానీ రఘురామ కృష్ణంరాజు తీరు మాత్రం చాలా విభిన్నంగా ఉంది. అధికార పార్టీ లో ఉండి ప్రజల యొక్క అభివృద్ధికి పాటు పడాలి కాని ప్రతిపక్షంతో చేరి ఆయన కుటిల రాజకీయాలకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ మారాలనుకుంటే స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు.. కానీ ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వైకాపా పై బురద జల్లుతూ జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకే జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మద్యం లో ఉన్న రసాయన పదార్థాల ఉన్నాయి.. అందువల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి అంటూ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా ఆ విషయమై ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య అధికారి అయిన రజత్ భార్గవ్ స్పందించాడు. ప్రభుత్వం పై రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో లభ్యమవుతున్న మద్యం లో హానికర రసాయనాలు ఉన్నాయంటూ ఆయన ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వం యొక్క పరువుకు భంగం వాటిల్లింది కనుక త్వరలోనే పెద్ద మొత్తంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. అదే కనుక నిజమైతే రఘురామ కృష్ణంరాజు కి కచ్చితంగా పెద్ద డ్యామేజ్ తప్పకపోవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.