Chandrababu : సరిగ్గా 12 గంటల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో చంద్రబాబుకి బిగ్ పిడుగు పడబోతోంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : సరిగ్గా 12 గంటల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో చంద్రబాబుకి బిగ్ పిడుగు పడబోతోంది..!

 Authored By kranthi | The Telugu News | Updated on :4 May 2023,6:00 pm

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించినట్టయిందది. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. వెంటనే కేబినేట్ సబ్ కమిటీని సీఎం జగన్ వేశారు.

what happened in chandrababu government in ap

what happened in chandrababu government in ap

ఆ కమిటీని జూన్ 26, 2019 లో సీఎం జగన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంది. విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు ఏంటి.. కంపెనీలు ఏంటి.. కార్పొరేషన్లు ఏంటి అనే దానిపై కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మోసపూరిత లావాదేవీలు జరిగాయని గుర్తించిన కేబినేట్ సబ్ కమిటీ సీఆర్డీఏతో పాటు పలు ప్రాజెక్టులలో అక్రమాలు జరిగాయని గుర్తించింది.ఆ తర్వాత కేబినేట్ సబ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. కేబినేట్ సబ్ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చించారు.

Amaravati land scam: Andhra CID summons Chandrababu Naidu | India News,The  Indian Express

Chandrababu : కేబినేట్ సబ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ

దీనిపై దర్యాప్తు జరిపించాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో సిట్ తో ప్రభుత్వం విచారిస్తోంది. 10 మంది సభ్యులతో సిట్ ను వేశారు. సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా కేసులు రిజిస్టర్ చేశారు. అదే సమయంలో సిట్ ఏర్పాటు ఎలా చేస్తారంటూ.. ఏపీ హైకోర్టుకు టీడీపీ పార్టీ ఎక్కింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసమే వేశారంటూ ఏపీ ప్రభుత్వంపై వాళ్లు మండిపడ్డారు. కానీ.. ఈ కేసుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అమరావతి కుంభకోణం గురించి ఏపీ ప్రభుత్వం కోర్టులో సబ్మిట్ చేసింది. సీబీఐ దర్యాప్తు కోసం కోరిన విషయాన్ని కూడా హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది