anand mahindra : ఈ ఫొటోలో ఉన్నదేమిటి ? చెప్పగలరా ? వైరల్ పిక్‌ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
anand mahindra సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా anand mahindraఎప్పటికప్పుడు ఆకట్టుకునే విషయాలను పంచుకుంటుంటారు. అందులో భాగంగానే ఆయన ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేస్తుంటారు. ఇక తాజాగా ఆయన ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ఉన్నదేమిటో కనుక్కోవాలని అన్నారు. అయితే చాలా మందికి ఆ ఫొటోలో ఉన్నదేమిటో అర్థం కాలేదు. ఓ గోళాకార వస్తువుకు ఆంటెన్నాలు ఉన్నాయి. దీంతో ఇదేదో సినిమాలోని ఫొటో అయి ఉంటుందని చాలా మంది భావించారు. కొంత మంది భిన్న రకాలుగా స్పందించారు. రక రకాల సమాధానాలు ఇచ్చారు.
What is this ‘thing’?
—Whose picture no millennial will recognise right away
—Whose name every millennial will recognise today pic.twitter.com/CCCdD36wY8— anand mahindra (@anandmahindra) May 13, 2021
అయితే ఆనంద్ మహీంద్రా anand mahindra పోస్ట్ చేసిన ఫొటో నిజానికి ఓ శాటిలైట్. అవును. దాన్ని రష్యా 1957, అక్టోబర్ 4వ తేదీన ప్రయోగించింది. ఆ శాటిలైట్ పేరు స్పుత్‌నిక్ 1. భూమికి సంబంధించి మొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ అది. అయితే ఆ శాటిలైట్‌ను చాలా మంది తప్పుగా చెప్పారు. కొందరు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్‌నిక్ వ్యాక్సిన్‌తో దాన్ని పోల్చారు.
కాగా ఆనంద్ మహీంద్రా anand mahindra పోస్టు చేసిన ఆ ఫొటోలో ఉన్న దాని గురించి కొందరు సరిగ్గానే సమాధానం చెప్పారు. ఇక ఆయన పోస్ట్ చేసిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటో తెలుసుకునేందుకు ఇప్పటికీ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.