YS Jagan – Chandrababu : చంద్రబాబుకీ వైఎస్ జగన్ కీ అదే తేడా మరి..!
YS Jagan – Chandrababu : ఇప్పటికే ఒకసారి ఏపీ ప్రజలు మనకు చాన్స్ ఇచ్చారు. ఇంకోసారి చాన్స్ ఇస్తే ఇక వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం. ఏపీలో మనమే అధికారంలో ఉంటాం అని అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవల వైజాగ్ లో జరిగిన నార్త్ నియోజకవర్గం కార్యకర్తల భేటీలో మాట్లాడిన జగన్ అన్నమాటలు అవి. ఆయన ఏదో వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు.. వచ్చే 30 ఏళ్లు ఏపీలో మనమే అధికారంలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. కార్యకర్తలతో అదే విషయాన్ని నొక్కి చెప్పారు. దాని కోసం నేతలు, కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే అది సుసాధ్యం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175. ఖచ్చితంగా 175 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.
ఏ నేతతో మాట్లాడినా.. ఎంతమంది కార్యకర్తలతో డిస్కస్ చేసినా.. వచ్చే 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని చెప్పుకొస్తున్నారు. అయితే.. వచ్చే 30 ఏళ్లు తామే అధికారంలో ఉండాలని అనుకోగానే అయిపోతుందా? జనాల్లో అది ఉండాలి కదా. తమ రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ.. పార్టీల నాయకులు కాదు కదా. జనాలు మెచ్చితే 30 ఏళ్లు ఏంటి.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు. అలాంటి వాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు.
YS Jagan – Chandrababu : సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. జనాలు ఓట్లేస్తారా?
నిజానికి సంక్షేమ పథకాల విషయంలో చాలామంది పొరపడేది అదే. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. జనాలు తమకు ఓట్లేస్తారని అందరూ అనుకుంటారు. సీఎం జగన్ కూడా అదే పొరపాటు పడుతున్నారా? కేవలం సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. మౌలిక సదుపాయాలు కల్పించనక్కర్లేదా. రోడ్లు సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదా? మరి.. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం మరిచిపోయిందా? ఇటువంటి వాటిపై కూడా సీఎం జగన్ కాస్త దృష్టి పెట్టాలని అంటున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే 30 ఏళ్లు కాదు.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు అంటున్నారు. చూద్దాం మరి.. సీఎం జగన్ ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీదనే కాకుండా అన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారో?