Pawan Kalyan : రంగంలోకి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్… పవన్ కల్యాణ్ కి చుక్కలు చూపించబోతున్నాడు
Pawan Kalyan : నిన్న మొత్తం వైజాగ్ లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. మూడు ప్రధాన పార్టీల నేతలంతా అక్కడే తిష్టవేశారు. దీంతో వైజాగ్ మొత్తం గందరగోళంగా మారింది. వైజాగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పలువురు వైసీపీ మంత్రుల కార్లపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరో కాదు జనసేన నేతలే అని చెప్పి పోలీసులు.. వాళ్లను అరెస్ట్ చేశారు. అయితే.. జనసేనాని వచ్చిన రోజే వైజాగ్ లో అధికార వైసీపీ పార్టీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జనను నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ కూడా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో నగరంలో చర్చా వేదికను నిర్వహించింది. అందుకే.. ఒకే రోజు వైజాగ్ లో మూడు ప్రధాన పార్టీల నేతలంతా మొహరించారు.
వైజాగ్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగారని తెలియగానే ఆయనకు స్వాగతం పలకడానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకొని వైసీపీ నేతలు, మంత్రులు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ మంత్రుల కార్లపై చెప్పులు, చీపుర్లు విసిరి దాడి చేశారు. ఇదంతా జనసేన పార్టీ కార్యకర్తల పనే అని పోలీసులు వెంటనే పలువురు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి వైజాగ్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. ప్రెస్ నోట్ లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద అనుమతి లేకుండా దాదాపు 300 మంది జనసేన నేతలు గుమిగూడారని పేర్కొన్నారు. మంత్రులను చంపేందుకే వాళ్లంతా అక్కడ గుమిగూడారని పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
Pawan Kalyan : అనుమతి లేకుండా 300 మంది జనసేన నేతలు గుమిగూడారు
అది సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించడమే అని తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మంత్రులపై దాడి చేస్తున్న సమయంలో పలువురు సామాన్య ప్రజలకు కూడా గాయాలయ్యాయని సీపీ తెలిపారు. మరోవైపు కొందరు ప్రయాణికులు తమ విమానాన్ని మిస్ అయ్యారని, ఇవన్ని ఘటనలకు బాధ్యులు జనసేన నేతలు, కార్యకర్తలని, వాళ్లపై కేసులు నమోదు చేశామని వైజాగ్ పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇప్పటి వరకు పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే.. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ లోనూ ఉదయం నుంచే పోలీసులు కూడా అక్కడే కాపలా కాశారు. అక్కడ కూడా పలువురు జనసేన నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.