Rudraksha | వృత్తి ప్రకారం ధరించాల్సిన రుద్రాక్షలు – ఐశ్వర్యం, విజయం సాధించాలంటే ఇలా ధరించండి!
Rudraksha | శివపూజలో రుద్రాక్షకు ఉన్న ప్రాధాన్యం గురించి మనందరికీ తెలిసిందే. రుద్రాక్షను మహాదేవుని ప్రసాదంగా పరిగణించి ధరించడం వలన పాపాలు నశించి, అనంతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృత్తి ఆధారంగా రుద్రాక్షను ధరించడం వల్ల ఐశ్వర్యం, విజయం మరింతగా పెరుగుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడు వృత్తి ప్రకారం ధరించాల్సిన రుద్రాక్షలు ఏవో చూద్దాం
#image_title
వ్యాపారం
వ్యాపారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావట్లేదా? అయితే, 10 ముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలు ధరించడం శుభప్రదం. ఇవి వ్యాపారంలో లాభాలను పెంచి, ఆర్థిక అడ్డంకులను తొలగిస్తాయని నమ్మకం.
వైద్య వృత్తి
వైద్యరంగంలో ఉన్నవారు లేదా ఈ రంగంలో చేరాలనుకునేవారు 3 ముఖి, 4 ముఖి, 9 ముఖి, 10 ముఖి, 11 ముఖి రుద్రాక్షలు ధరించడం శ్రేయస్కరం. ఇవి ఆత్మశాంతిని, ఏకాగ్రతను పెంచి, వైద్యరంగంలో ఉన్నత స్థానం పొందడంలో సహాయపడతాయి.
న్యాయ వృత్తి
న్యాయవాదులు లేదా న్యాయ రంగంలో పనిచేసేవారు ఏకముఖి, 5 ముఖి, 13 ముఖి రుద్రాక్షలు ధరించడం వల్ల వాక్చాతుర్యం, తీర్పు స్పష్టత పెరుగుతాయి. ఇవి న్యాయ రంగంలో విజయాన్ని సాధించడంలో దోహదం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
రాజకీయం
రాజకీయ రంగంలో ఎదగాలనుకునేవారు, తమ స్థానాన్ని పదిలపరచుకోవాలనుకునేవారు ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలు ధరించాలి. ఇవి నాయకత్వ గుణాలను, ఆకర్షణను పెంచుతాయని విశ్వాసం.
ఇంజనీరింగ్ వృత్తి
ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ రంగంలో ఉన్నవారు 9 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలు ధరించడం అనుకూలం. ఇవి ఆలోచనలో సృజనాత్మకతను, పనిలో విజయాన్ని కలిగిస్తాయని చెబుతారు.