Ustaad Bhagat Singh Movie 1st Day Collection : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్, థియేటర్స్ కౌంట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి వివరాలు ఇవే
ప్రధానాంశాలు:
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి వివరాలు ఇవే..!
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ Tollywood Box Office వద్ద సరైన సందడి లేదు. థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక చాలా చప్పగా సాగుతున్నాయి. ఇలాంటి డ్రై రన్‌కు బ్రేక్ వేసి, టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపిరి పోయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ Ustaad Bhagat Singh థియేటర్లలోకి వచ్చేసింది. Harish Shankar డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవల్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా థియేటర్స్ కౌంట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? మొదటి రోజు బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి వివరాలు ఇవే..!
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : గ్రాండ్ రిలీజ్.. థియేటర్స్ కౌంట్ ఇదే
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దాదాపు 900 కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా Worldwide దాదాపు 1600 కి పైగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ Pre Release Business and Break Even
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.132 కోట్ల వాల్యూ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. అంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ.133 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ Break Even టార్గెట్‌ను అందుకోవాల్సి ఉంటుంది.
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్.. వెనుకబడిన ఉస్తాద్? Advance Bookings Report
సినిమా రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ పరిశీలిస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డీసెంట్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు రూ.25 కోట్ల రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అయితే, పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అని చెప్పాలి. ఉదాహరణకు, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ OG, అలాగే ‘హరి హర వీరమల్లు’ Hari Hara Veera Mallu చిత్రాలతో పోల్చితే ఉస్తాద్ బుకింగ్స్ వెనుకబడి ఉన్నాయి. హరి హర వీరమల్లు రిలీజ్ కి ముందు రోజు వరకు ఏకంగా రూ.44 కోట్ల రేంజ్ దాకా ప్రీ బుకింగ్స్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ వీక్ గా ఉండటానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే.. నైజాం (తెలంగాణ) ఏరియాలో ఈ సినిమాకు ఎలాంటి టికెట్ హైక్స్ Ticket Hikes లేవు. దీనివల్ల అడ్వాన్స్ బుకింగ్స్ నంబర్స్ కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల, సినిమా పూర్తిగా ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ Mouth Talk పైనే ఆధారపడి బాక్సాఫీస్ బరిలోకి దిగింది.
Ustaad Bhagat Singh Movie 1st Day Collection : డే 1 కలెక్షన్స్ అంచనా.. పవన్ రంపకోత షురూ! Day 1 Box Office Expectations
ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్, గ్రౌండ్ లెవల్ బజ్ ను బట్టి చూస్తుంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు Day 1 తెలుగు రాష్ట్రాల్లో సులభంగా రూ.32 కోట్ల నుంచి రూ.34 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ పబ్లిక్ టాక్ రావడంతో, హాలిడే అడ్వాంటేజ్‌తో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. షో షోకి బుకింగ్స్ జోరు చూపిస్తున్నాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఫస్ట్ డే ఓల్డ్ వైడ్ గ్రాస్ రూ.40 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం విశేషం.సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. తొలిరోజు ట్రేడ్ అంచనాలను ఏ మేరకు మించిపోతుందో, బ్రేక్ ఈవెన్ దిశగా ఎలా పరుగులు పెడుతుందో అధికారిక లెక్కలు వచ్చాక చూడాలి.