what this family will do with cow dung
Cow Dung : ప్రతిరోజూ ఆవు వేసే పేడ కోసం ఆ కుటుంబంలోని వారంతా ఎదురు చూస్తుంటారు. కానీ.. అలా ఎందుకో.. అసలు నిజం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అవును.. మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే.. పెంపుడు జంతువులను చాలామంది పెంచుకుంటారు. కొందరు కుక్కలను పెంచితే మరికొంతమంది పిల్లులు, మరికొంత మంది ఆవులను కూడా పెంచుకుంటారు. అయితే వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒక్కోసారి మనం ఊహించని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దలు కూడా అంటూ ఉంటారు.
అయితే.. ఇదే నేపథ్యంలో ఓ కుటుంబం కాస్త ఏమరపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు ఏం చేసిందో తెలిసి ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. దీంతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇంతకీ ఆ ఆవు ఏం చేసింది. ఈ సంఘటన వెనుక ఉన్న అసలు వివరాల గురించి తెలుసుకుందాం. ఈ ఘటన కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి తాలుకాలోని హీతన హల్లీలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంట్లో ఓ ఆవును పెంచుకుంటున్నాడు. దానికి ఒక దూడ కూడా ఉంది. అయితే హిందువులు సంప్రదాయం ప్రకారం ఆవును పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా గోమాతకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు.
what this family will do with cow dung
పండుగల సందర్భంగా ఆవును చక్కగా ముస్తాబు చేసి వాళ్లను పూజించడం భారతీయులకు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యంలో శ్రీకాంత్ కూడా తన ఇంట్లో ఉన్న ఆవుకు గోపూజ చేద్దామని అతడి ఇంట్లోని వారంతా నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆవుకు దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. ఇక.. ఆ పూజ సమయంలో ఆవును పూల దండలతో అలంకరించడం, రంగురంగుల రిబ్బన్లతో అలంకరించారు. ఒక 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా ఆవును, దూడను అలంకరించారు. అయితే.. వాటికి పూజ చేసిన తర్వాత పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన పెట్టారు. కాసేపు వాళ్లు ఏమరపాటుగా ఉండటంతో ఆ పక్కనే ఆవుకు అలంకరించి పెట్టిన పూలు, బంగారు గొలుసు కనిపించకుండా పోయాయి.
what this family will do with cow dung
అయితే.. ఆ దండలో బంగారు గొలుసు కూడా ఉండటంతో కుటుంబీకులు అందరూ ఆ గొలుసు కోసం అంతటా వెతికారు. కానీ.. బంగారు గొలుసు మాత్రం కనిపించలేదు. చివరికి ఆ ఆవే గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకొని ఆవు పేడ వేసినప్పుడు దానితో పాటు బంగార గొలుసు కూడా వస్తుందని అనుకున్నారు. వరుసగా నెల రోజుల పాటు 3 పూటలా ఆవు పేడ వేసినప్పుడల్లా ఆ పేడలో వెతుకుతూనే ఉన్నారు కానీ.. ఆవు పేడ వేస్తోంది కానీ.. గొలుసు మాత్రం బయటికి రాలేదు. ఇలా నెల రోజులకు పైనే గడిచింది. ఇక.. ఆవు పేడ వేసిన ప్రతిసారి అందులో వెతకడం, కుటుంబ సభ్యుల వంతు అయింది. అయితే.. పేడతో పాటు బంగారు గొలుసు రాకపోవడంతో ఇక వారు తప్పక ఆవును తీసుకొని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్లారు.
దానికి పలు పరీక్షలు చేసిన పశువైద్యులు.. ఆ గొలుసు ఆవు కడుపులోనే ఉందని నిర్దారించారు. వెంటనే గొలుసును కనుక బయటికి తీయకపోతే ఆవు ఆరోగ్యానికి కూడా మంచిది కాదని.. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో డాక్టర్లు ఆవుకు సర్జరీ చేసి ఆ బంగారు గొలుసును బయటికి తీశారు. అయితే.. ఆవు మింగిన ఆ గొలుసు 20 గ్రాములు ఉండేది. ఆవు నుంచి బయటికి తీసిన తర్వాత అది 18 గ్రాములు మాత్రమే ఉందట. అయితే.. అలా బరువు తగ్గడానికి కారణం.. ఆ గొలుసులోని ఒక చిన్న బాగం మిస్ అయిందట. అందుకే ఆ గొలుసు బరువు తగ్గిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.