Agent Movie : అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఇటీవల ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాపై జనాలలో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోల కనిపించాడని అంటున్నారు. అలాగే నిర్మాత 80 కోట్ల బడ్జెట్ తో అఖిల్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. అయితే ఈ పాత్రకి ముందుగా వేరే హీరోని అనుకున్నారట.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు లెవెల్లో వ్యూస్ పొందాయి. పాటలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ట్రైలర్ హాలీవుడ్ సినిమాలను తలపించింది. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్ కూడా మార్చుకొని సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడ్డాడు అని తెలుస్తోంది. అన్నింటికీ మించి ఈ సినిమాలో మమ్ముట్టి క్యారెక్టర్ హైలెట్ గా ఉందని టాక్.
సాధారణంగా వేరే ఇండస్ట్రీ హీరోలు తెలుగులో సినిమాలు చేసినప్పుడు వారికి వేరే వారు డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ సినిమాలో ముమ్ముట్టి తనకు తానే డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. గతంలో కూడా ముమ్ముట్టి తెలుగులో నటించిన యాత్ర సినిమాకి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా మరోసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మమ్ముట్టి పాత్రకు బదులుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కాని చివరికి ముమ్ముట్టికి స్టోరీ చెప్పడం ఆయన వెంటనే ఓకే చేయడం జరిగిందని తెలుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.