Tirupati bypoll : వకీల్ సాబ్ హిట్టయింది… తిరుపతిలో బీజేపీ గెలుపు కన్ఫమ్ అయింది?
Tirupati bypoll : ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయినవి రెండే రెండు. ఒకటి వకీల్ సాబ్ సినిమా… రెండోది తిరుపతి ఉపఎన్నిక. ఈ రెండు విషయాల గురించే ఏపీ ప్రజలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్… వకీల్ సాబ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు.
అయితే… సినిమా రిలీజ్ రోజున స్పెషల్ ప్రీమియర్ షోలకు ఏపీ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్ణయాన్ని కూడా ఆపేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ అభిమానులు నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ధర్నాలు చేశారు. ఏది ఏమైనా… సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
సినిమాను ఎంత ఆపాలన్నా… జగన్ సర్కారు అడుగడుగునా సినిమా ఆపే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం సూపర్ హిట్ అయిందని పవన్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను చూస్తేనే సీఎం జగన్ కు భయం వేస్తోందని… అందుకే సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేశారని…. బీజేపీ జాతీయ సెక్రటరీ సునీల్ దియోధర్ అన్నారు.
Tirupati bypoll : అటు వకీల్ సాబ్.. ఇటు తిరుపతి ఉపఎన్నిక
పవన్ సినిమా రిలీజ్ చేస్తేనే సీఎం జగన ఇంతలా భయపడుతున్నారు.. మరి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నేతృత్వంలో… బీజేపీ, జనసేన రాష్ట్రమంతా విస్తరిస్తే సీఎం జగన్ పరిస్థితి ఏంటి? వకీల్ సాబ్ సూపర్ హిట్ ఎలా అయిందో.. రేపు తిరుపతిలో కూడా బీజేపీ, జనసేన అభ్యర్థి గెలవడం ఖాయం. మీ రౌడీయిజాలు మా దగ్గర కాదు… మీవి అవినీతి రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు. వాటికి వ్యతిరేకంగా మేం పోరాడుతాం… అని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ప్రభుత్వం కావాలని బెనిఫిట్ షోలను రద్దు చేసిందన్నారు. వకీల్ సాబ్ సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్లిన అనంతరం ఆయన వైవిధంగా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద వకీల్ సాబ్ సినిమాకు, తిరుపతి ఉపఎన్నికకు భలే లింక్ పెట్టేశారు.
ప్రతీ ‘శుక్రవారం’ నాంపల్లి కోర్టుకు వెళ్ళి హాజరు వెయ్యించుకునే అలవాటు ఉన్నవాడే కదా #VakeelSaab ను చూసి భయపడేది.
My best wishes for the grand success of the movie.@PawanKalyan @SVC_official pic.twitter.com/4iRgenbJ54
— Sunil Deodhar (Modi Ka Parivar) (@Sunil_Deodhar) April 9, 2021