Goutam Sawang : గౌతమ్ సవాంగ్ కు పోస్టింగ్ ఎక్కడ.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటీ…?
Goutam Sawang : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీగా పని చేస్తున్న గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కె రాజేంద్రనాథ్ రెడ్డి కి డిజిపిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీ ఏ డీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 2023 జూలై వరకు గౌతమ్ సవాంగ్ సర్వీస్ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.గౌతమ్ సవాంగ్ కు ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వని సర్కార్… జిఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Where is the posting to Gautam Sawang
కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ నియమించిన ప్రభుత్వం… రెండు మూడు రోజుల్లో కేంద్రానికి రెండు పేర్లతో ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే… కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. 1992 బ్యాచ్ చెందిన కసిరెడ్డి… 2026 ఏప్రిల్ వరకు విధుల్లో ఉండే అవకాశం ఉంది.