YS jagan : సొంత పార్టీ నేత చేతిలో జగన్ తన ఓటమిని ఒప్పుకున్నట్టేనా..?
YS jagan : వైసీపీ పార్టీ అధినేత, సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలు, స్థానిక, మన్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే నిజమే అని అందరూ అంగీకరించాల్సిందే. సంక్షేమ పథకాల అమలులో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. కానీ తన సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో జగన్‌కు తీవ్ర నిరాశే ఎదురైందని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో జగన్ ఎంత చెబితే అంత.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు మారు మాట మాట్లాడరు. జగన్ మాటే వేదం, శాసనం కూడా.. అలాంటిది జగన్‌ను ఒక్క లీడర్ మాత్రం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఆయన్ను ఢీకొట్టడం తన వాళ్ల కాదని జగన్ కూడా మిన్నకుండి పోయారని టాక్ నడుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలను అమలు చేస్తూ వచ్చారు. అయితే, జగన్ తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోద యోగ్యం కాకపోయినా ఎవరు మారుమాట మాట్లాడలేదు. కానీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం జగన్ తీరు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఖరాఖండీగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే జగన్ చుక్కెదురు అయ్యింది. అధికార పార్టీలోనూ ఉంటే ప్రతిరోజూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను పిచ్చి నిర్ణయాలుగా ఆర్ఆర్ఆర్ ఎత్తి చూపుతూ వచ్చారు.
YS jagan : ఆర్ఆర్ఆర్‌తో జగన్‌కు ఎక్కడ చెడింది..?
అయితే, ఆయన్ను పిలుపించుకుని మాట్లాడితే రఘురామకృష్ణం రాజు ఏ విషయంలో హర్ట్ అయ్యారో తెలిసిపోయేది. అందుకోసం జగన్ తన నిర్ణయాలను కొంచెం మార్చుకుంటే బాగుండేది. ఆర్ఆర్ఆర్ ఆది నుంచి టీటీడీలో అన్యమతస్తుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ జగన్ ఆయన కోపాన్ని చల్లార్చాల్సింది పోయి అందులో పెట్రోలో పోశారు. కేసులు, ఎంక్వైరీల పేరుతో అరెస్టు చేయించారు. ఎంపీపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, జగన్ ఎంపీకి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయం ఆయనపై ప్రభావం చూపలేదు. తీరా జగన్ కూడా సైలెంట్ అయ్యారు. దీంతో జగన్ తన ఓటమిని అంగీకరించారని కొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.