ChandraBabu : ఆ ఒక్క సీటు కోసం రోడ్డు మీదే కొట్టుకుంటున్న నేతలు.. తలపట్టుకున్న చంద్రబాబు.. ఆయనకే ఆ సీటు కన్ఫమ్ అయిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ChandraBabu : ఆ ఒక్క సీటు కోసం రోడ్డు మీదే కొట్టుకుంటున్న నేతలు.. తలపట్టుకున్న చంద్రబాబు.. ఆయనకే ఆ సీటు కన్ఫమ్ అయిందా?

 Authored By kranthi | The Telugu News | Updated on :12 November 2022,1:00 pm

ChandraBabu : ఏపీలో టీడీపీ పార్టీకి చంద్రబాబు తప్పితే సరైన నాయకుడే లేడు. పార్టీని ముందుకు నడిపించేవాళ్లే లేరు. నారా లోకేశ్ ఉన్నప్పటికీ.. పూర్తిగా ఆయన మీదనే భారం మోపలేరు చంద్రబాబు. పార్టీలో యువత ఉండాలని చంద్రబాబు ఆశిస్తున్నారు కానీ.. పార్టీలోకి యువత మాత్రం చేరడం లేదు. అంతా వయసు మళ్లిన వాళ్లు.. వయసు మళ్లిన ఆలోచనలతో టీడీపీ ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. మరోవైపు ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే టికెట్లను కూడా కన్ఫమ్ చేశారు. సిట్టింగ్ అందరికీ సీట్లు అని చెప్పనైతే చెప్పారు కానీ.. కొంతమంది నేతల విషయంలో మాత్రం చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను నియమిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను నియమించలేకపోతున్నారు. దానికి కారణం.. క్షేత్రస్థాయిలో ఉండే వర్గ బేధాలు. వాటి వల్ల.. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లేకుండా కేడర్ గందరగోళంలో పడపోయింది. ఒక సీటుకు ముగ్గురు పోటీ పడితే చంద్రబాబు మాత్రం ఏం చేయగలరు. అసలు పార్టీని ముందుండి నడిపించే నాయకులు కావాలి కానీ.. గ్రూప్ వార్ లు చేస్తే ఎలా ఉంటది. గ్రూప్ వార్ వల్ల పార్టీకే నష్టం కలుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. కొందరు నేతలు మాత్రం పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. అలాంటి గ్రూప్ వార్ ఉన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. అక్కడ టీడీపీ ఇన్ చార్జ్ పదవిపై ముగ్గురు నేతలు కన్నేశారట. దీంతో అధిష్ఠానానికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. నిజానికి అక్కడ చాలా రోజుల నుంచి నియోజకవర్గ ఇన్ చార్జ్ లేరు.

who will get ticket from tdp ChandraBabu in sattenapalli constituency

who will get ticket from tdp ChandraBabu in sattenapalli constituency

ChandraBabu : సత్తెనపల్లిలోనూ అదే పరిస్థితి

దీంతో అక్కడ గ్రూపులుగా కార్యకర్తలు విడిపోయారు. ఇన్ చార్జ్ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడటమే కాదు.. తమ కేడర్ ను పెంచుకొని వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. అందులో ఒక నేత మాజీ స్పీకర్ కోడెల కొడుకు శివరాం కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆంజనేయులు. మరో నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు. ఈ ముగ్గురు పోటీ పడుతుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. సత్తెనపల్లిలో 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 లో మాత్రం కోడెల గెలిచారు. 2019 లో వైసీపీ అభ్యర్థి అంబటి గెలిచారు. ఆ తర్వాత సత్తెనపల్లిలో ఒక ఇన్ చార్జ్ కూడా లేరు. దీంతో అక్కడ టీడీపీ కేడర్ మొత్తం గందరగోళానికి గురయింది. చూద్దాం మరి.. ఈ పంచాయితీ ఇంకా ఎంత దూరం వెళ్తుందో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది