ఇంత సడెన్ గా సీఎం జగన్.. అమిత్ షాను కలవడం వెనుక అసలు కారణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys jagan : ఇంత సడెన్ గా సీఎం జగన్.. అమిత్ షాను కలవడం వెనుక అసలు కారణం ఏంటి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 January 2021,6:00 pm

Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీకి వెళ్లేంతవరకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ఎవ్వరికీ తెలియదు. అంత సడెన్ గా ఆయన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. గత నెలలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అనే దానిపై చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రతిపక్షాలైతే దాన్ని కూడా రాద్ధాంతం చేశాయి.

why ap cm ys jagan met amit shah

why ap cm ys jagan met amit shah

మంగళవారం రాత్రి సీఎం జగన్.. అమిత్ షాతో సుమారు గంటన్నర దాకా భేటీ అయ్యారు. వీళ్ల మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ఇద్దరూ చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారు.

మూడు రాజధానుల అంశం కూడా చర్చకు వైఎస్ జ‌గ‌న్ వెళ్లింది..?

అలాగే.. ఏపీలో మూడు రాజధానుల అంశం గురించి కూడా సీఎం జగన్.. అమిత్ షాతో చర్చించారు. రాజధాని వికేంద్రీకరణ. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై రీ నోటిఫికేషన్ జారీ చేయాలని.. దానికి ఆమోదం తెలపాలని జగన్ ఈసందర్భంగా కోరారు.

అలాగే.. ఆర్సీసీ సిఫారుసు మేరకు పోలవరం వ్యయాన్ని 55,656 కోట్ల రూపాయలుగా ఆమోదించాలంటూ అమిత్ షాను జగన్ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు, ఏపీ విద్యుత్ రంగానికి కేంద్ర నుంచి రావాల్సిన సహాయం, ఇతర బకాయిల గురించి సీఎం జగన్.. అమిత్ షాతో చర్చించారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది