Women’s Day : అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటారో తెలుసా .. THETELUGUNEWS స్పెషల్ స్టోరీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women’s Day : అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటారో తెలుసా .. THETELUGUNEWS స్పెషల్ స్టోరీ !

 Authored By prabhas | The Telugu News | Updated on :8 March 2023,4:00 pm

Women’s Day : ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్ని జరుపుకుంటాయి. ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటాం. ఈ రోజున మహిళల సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేసుకుంటాం. నిత్యజీవితంలో వారు రోజు ఎదుర్కొనే సమస్యలను ఎత్తి చూపడానికి మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వబడ్డ ఒక అవకాశం ఈ మహిళ దినోత్సవం. ఆడ మగ అంతా ఒక్కటే అనే అంశాన్ని ప్రతి సంవత్సరం ఈరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. అలాంటి వారికి THETELUGUNEWS స్పెషల్ స్టోరీ అందిస్తుంది.

Why celebrate Womens day

Why celebrate Womens day

మహిళా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకోండి.ఫిబ్రవరి 8, 1909 సంవత్సరం నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. న్యూయార్క్‌లో వస్త్ర కార్మికుల సమ్మెను పురస్కరించుకుని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ రోజును ఉమెన్స్ డే గా ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఎలాంటి వేడుకలు జరగలేదు. అయితే మొదటగా మహిళా దినోత్సవాలు 1911లో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా యూరోపియా దేశాల మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా మహిళలు ఓటు హక్కును కోరుతూ, ప్రభుత్వ ఆఫీసులను నిర్వహించే హక్కులను కోరుతూ రోడ్డుపై పోరాటం చేశారు. లింగ వివక్ష తొలగిపోవాలని, సమానమైన వేతనం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.

Happy International Women's Day 2023: Wishes Images, Status, Quotes, Whatsapp Messages, GIF Pics, Photos, and HD Wallpapers

అలాగే మార్చి 8 ,1917 లో ఐరోపాలో మరో సంఘటన జరిగింది. సెయింట్ పీటర్ బర్గ్ లోని మహిళా వస్త్ర కార్మికులు రోడ్డుపైకి వచ్చి మహిళ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ తర్వాత ఈ పోరాటం రష్యన్ విప్లవంగా అవతరించింది. దీంతో ఐక్యరాజ్యసమితి మార్చి 8న మహిళల ప్రత్యేకమైన రోజుగా ప్రకటించింది. ఆ రోజు నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో దూసుకెళుతున్నారు. మగవాళ్లకు పోటీగా ఎందులోనైనా తాము విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు. మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది