Women’s Day : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి
ప్రధానాంశాలు:
Women's Day : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి
Women’s Day : నెల్లూరు : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాగుంట లేఅవుట్ లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుజయ్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసుల రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్ లు పాల్గొన్నారు.

Women’s Day : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి
Women’s Day ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులు .. మహిళలను సన్మానించి వారికి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణచివేత కొనసాగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్యా ,ఉద్యోగం , వ్యాపారం , రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి అన్నారు. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఒక కుటుంబాన్ని బలపరుస్తుందన్నారు. ఒక కుటుంబం బలంగా ఉంటే అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజంతో ఆనందంగా ముందుకు వెళ్తామన్నారు.
ప్రతి మహిళను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుటుంబ పోషణ చూసుకుంటూ , కుటుంబ అవసరాలు తీర్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం .. సిద్ధాంతాలను నమ్మి పార్టీ కోసం పనిచేస్తున్న వీర నారీ లకు ఆయన ధన్యవాదములు తెలిపారు. మన జీవితాల్లో దిశా నిర్దేశం చూపించగలది ఒక్క మహిళలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు హైమా, హసీనా ,మల్లికా , సందని జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.