ChandraBabu : ఇవే నా చివరి ఎన్నికలు.. అని చెప్పి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? దాని వెనుక అసలు స్టోరీ ఇది
ChandraBabu : ఇవే నా చివరి ఎన్నికలు. మీరు గెలిపిస్తే సరి.. లేదంటే ఇక ఇంటికే. ఇక రాజకీయాల జోలికే పోను.. అన్నట్టుగా చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నిజానికి.. చంద్రబాబు ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇది కూడా అంతే. చంద్రబాబు తన ప్రచారంలో కోణాన్ని మార్చారు తప్పితే తను మారలేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ప్రజల నుంచి సానుభూతిని పొందడానికే చంద్రబాబు ఇవే నా చివరి ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా ముఖ్యమైనవి.
వైసీపీ కంటే కూడా టీడీపీ గెలవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ.. ఒకవేళ టీడీపీ గెలవకపోతే మాత్రం ఇక టీడీపీ ఖేల్ ఖతం అయినట్టే. టీడీపీ భూస్థాపితం అయిపోయినట్టే. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ మట్టికరుచుకుపోయింది. ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి ఎదురయితే అది ఖచ్చితంగా చంద్రబాబు ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. ఆ మచ్చ చంద్రబాబు వద్ద ఎప్పటికీ ఉండిపోతుంది. ఒకవేళ చంద్రబాబు నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటే ఏంటి పరిస్థితి. ఒకవేళ తన సానుభూతి ఇప్పుడు వర్కవుట్ కాకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటి.. పార్టీని ఎవరు ముందుండి నడిపించాలి అనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల్లో మొదలయ్యాయి.
ChandraBabu : నిజంగానే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
చంద్రబాబు తన వయసు 70 దాటినా కూడా ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. పార్టీని ఇంకొన్ని సంవత్సరాలు నడిపే సత్తా ఆయనకుందని టీడీపీ నేతలకు కూడా తెలుసు. అయినా కూడా ఒకవేళ పార్టీ ఓడిపోతే పార్టీని ముందుకు నడిపిస్తారా? అనేదే మళ్లీ అందరూ లేవనెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే.. కర్నూలు సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం లేపడం పక్కన పెడితే.. చంద్రబాబు ఏం మాట్లాడినా దానికి ఒక్క లెక్క పక్క ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోరని, ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదంతా ఎన్నికల కోసం ఆయన స్టంట్ అంటూ చెబుతున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?