ChandraBabu : ఆ ఒక్క మాట అని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. చివరి ఎలక్షన్ అనడంతో ఆరేసుకుంటున్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ChandraBabu : ఆ ఒక్క మాట అని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. చివరి ఎలక్షన్ అనడంతో ఆరేసుకుంటున్నారు..!

ChandraBabu : టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే కదా. ఆ పర్యటనలో భాగంగా ఆయన కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. తొందరపడి ఇవే నా చివరి ఎన్నికలు.. మీరు గెలిపిస్తే సరి.. లేదంటే ఇక మీ ఇష్టం అంటూ చంద్రబాబు తొందరపడి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు వాటిని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 November 2022,10:20 am

ChandraBabu : టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే కదా. ఆ పర్యటనలో భాగంగా ఆయన కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. తొందరపడి ఇవే నా చివరి ఎన్నికలు.. మీరు గెలిపిస్తే సరి.. లేదంటే ఇక మీ ఇష్టం అంటూ చంద్రబాబు తొందరపడి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు వాటిని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

అధికారంలో ఉంటే ఒక లెక్క.. లేకపోతే ఇంకో లెక్క.. తాను ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ఇంకోసారి తనను గెలిపించకపోతే ఇక తన సంగతి అంతే అని ముందే చంద్రబాబు సిగ్నల్ ఇస్తున్నారా? అసలు టీడీపీలో ఏం జరుగుతోంది అనేది అంతుపట్టడం లేదు. చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యలపై అసలు వైసీపీ స్పందించాలి కానీ.. అటూ ఇటూ కాకుండా జనసేన పార్టీ స్పందిస్తోంది. 2014 నుంచి ఓడిపోతున్నా కూడా ప్రజాక్షేత్రంలోనే పవన్ కళ్యాణ్ ఉంటున్నారని..

why chandrababu spoke those comments in kurnool meeting

why chandrababu spoke those comments in kurnool meeting

ChandraBabu : చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే జనసేనకు కలిసొస్తుందా?

ఓడిపోతే ఇక ఇవే నా చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అంటూ జనసైనికులు కౌంటర్ వేస్తున్నారు. 40 ఏళ్ల విజన్ ఎక్కడ పోయింది.. అంటూ జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. 2020 తోనే చంద్రబాబు విజన్ తో పాటు పార్టీ కూడా భూస్థాపితం అయిందని.. 2024 నుంచి జనసేన పార్టీ శకం ప్రారంభం కాబోతోందంటూ జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది