Janasena – Chandrababu : జనసేనపై చంద్రబాబు దారుణ కుట్ర..!
Janasena – Chandrababu : అదేంటి.. జనసేన, టీడీపీ ఒక్కటే కదా. రెండు పార్టీలు కలిసిపోయాయి కదా. అధికారికంగానే కలిసిపోయాయి. రెండు పార్టీల నేతలు కూడా కలిసి తిరుగుతున్నారు. అధికార వైసీపీ పార్టీని ఓడించి తాము అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరోవైపు జనసేనపై చంద్రబాబు కుట్ర చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు. ఎందుకంటే.. జనసేనతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ మరోవైపు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.
దానికి కారణం.. ఏబీఎన్ లో రాసిన ఆర్కే ఆర్టికల్. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారట. పవన్ కళ్యాణ్ కు సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా లేదు కాబట్టి.. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేయకుండా బీఆర్ఎస్ తో పని చేయాలి లేదంటే ఏపీలో చంద్రబాబును ఓడించాలని కేసీఆర్.. బంపర్ ఆఫర్ ఇచ్చారట. అయితే.. ఈ కథనాలు రాయించింది ఎవరో కాదు.. చంద్రబాబే అని.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబే ఈ పన్నాగాలు పన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
Janasena – Chandrababu : ఇలాంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టం
అయితే.. ఈ కథనంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు కానీ.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం స్పందించారు. ఇలాంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టమని చంద్రబాబుకు ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు పంపించారు నాగబాబు. ఆ కథనం ప్రచురించబడిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మొత్తానికి వైరాన్ని పెంచేలా చేశాడు ఆర్కే అంటూ ఏపీ రాజకీయాల్లో వచర్చ మొదలైంది. అందుకే.. చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి అని జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నారు.