Vinayaka Chavithi : హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే ఇప్పుడు మనం మరో రెండు రోజుల్లో శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ క్రమంలోనే వినాయక చవితి సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడానికి భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఇక ఈ రోజున భక్తులు వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తారు. కొందరు ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మరి కొందరు పలుచోట్ల మండపాలను స్థాపించి వినాయకుని ప్రతిష్టించి పూజిస్తారు. అయితే ఈ వినాయక చవితి పండుగ గురించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ చంద్రుడిని చూసినట్లయితే దానిని ఆశుభంగా భావిస్తారు . మరి తెలియక వినాయక చవితి రోజు చంద్రుని చూసినట్లయితే ఏం చేయాలి..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అనేది అశుభంగా పరిగణించడం జరిగింది. చవితి రోజు చంద్రుని చూసినవారు నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుందని చెబుతుంటారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతారు. ఈ విధంగా చవితి రోజు చంద్రున్ని చూస్తే జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయని సమాజంలో వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పురాణాల్లో పేర్కొనడం జరిగింది.
పురాణగాథల ప్రకారం వినాయకుడి వాహనం ఎలుక. అయితే వినాయకుడు ఒకసారి తన వాహనమైన ఎలుకపై కూర్చుని బయటికి వస్తాడు. ఇక వినాయకుడి అధిక బరువు కారణంగా కాస్త తడబడతాడు. అలా తడబడిన వినాయకున్ని చూసి శివుడు శిగలో ఉన్న చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇక ఆ సమయంలో ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పులకు నిందలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపిస్తాడు. అయితే దేవతలు కోరిక మేరకు వినాయకుడు ఈ శాపాన్ని మారుస్తూ భాద్రపాద మాసం శుక్లచతుర్థి రోజు రాత్రి సమయంలో ఎవరైతే చంద్రుని చూస్తారో వారు సమస్యలు ఎదుర్కొంటారని శపించాడు.
అయితే పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని దొంగలించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనికి గల ముఖ్య కారణం గణేష్ చతుర్థి రోజు శ్రీకృష్ణుడు పాల గ్లాసులో కనిపిస్తున్న చంద్రుని చూశాడు. దీంతో కన్నయ్య కూడా గణేశుడి శాపానికి విముక్తి పొందలేకపోయాడు.
చంద్రుని చూస్తే ఏం చేయాలి…
అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఇక ఈ వినాయక చవితి రోజున ఎవరైతే పొరపాటున చంద్రుని చూస్తారో వారు కొన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా శాపం నుంచి విముక్తి పొందవచ్చు. అయితే చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో వారు వినాయక వ్రత కథను చదివి ఉపవాసం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాక ఒక మంత్రాన్ని పట్టించడం ద్వారా కూడా ఈ దోషాల నుండి విముక్తి పొందవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.