Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడుని చూస్తే ఏమవుతుంది..? దోష నివారణకు ఏం చేయాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడుని చూస్తే ఏమవుతుంది..? దోష నివారణకు ఏం చేయాలంటే…!

Vinayaka Chavithi : హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే ఇప్పుడు మనం మరో రెండు రోజుల్లో శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ క్రమంలోనే వినాయక చవితి సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడానికి భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఇక ఈ రోజున భక్తులు వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తారు. కొందరు ఇంట్లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడుని చూస్తే ఏమవుతుంది..? దోష నివారణకు ఏం చేయాలంటే...!

Vinayaka Chavithi : హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే ఇప్పుడు మనం మరో రెండు రోజుల్లో శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ క్రమంలోనే వినాయక చవితి సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడానికి భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఇక ఈ రోజున భక్తులు వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తారు. కొందరు ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మరి కొందరు పలుచోట్ల మండపాలను స్థాపించి వినాయకుని ప్రతిష్టించి పూజిస్తారు. అయితే ఈ వినాయక చవితి పండుగ గురించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ చంద్రుడిని చూసినట్లయితే దానిని ఆశుభంగా భావిస్తారు . మరి తెలియక వినాయక చవితి రోజు చంద్రుని చూసినట్లయితే ఏం చేయాలి..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Vinayaka Chavithi చవితి రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు..?

పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అనేది అశుభంగా పరిగణించడం జరిగింది. చవితి రోజు చంద్రుని చూసినవారు నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుందని చెబుతుంటారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతారు. ఈ విధంగా చవితి రోజు చంద్రున్ని చూస్తే జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయని సమాజంలో వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పురాణాల్లో పేర్కొనడం జరిగింది.

Vinayaka Chavithi అసలు నమ్మకం ఏంటి..?

పురాణగాథల ప్రకారం వినాయకుడి వాహనం ఎలుక. అయితే వినాయకుడు ఒకసారి తన వాహనమైన ఎలుకపై కూర్చుని బయటికి వస్తాడు. ఇక వినాయకుడి అధిక బరువు కారణంగా కాస్త తడబడతాడు. అలా తడబడిన వినాయకున్ని చూసి శివుడు శిగలో ఉన్న చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇక ఆ సమయంలో ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పులకు నిందలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపిస్తాడు. అయితే దేవతలు కోరిక మేరకు వినాయకుడు ఈ శాపాన్ని మారుస్తూ భాద్రపాద మాసం శుక్లచతుర్థి రోజు రాత్రి సమయంలో ఎవరైతే చంద్రుని చూస్తారో వారు సమస్యలు ఎదుర్కొంటారని శపించాడు.

Vinayaka Chavithi : శ్రీకృష్ణుడు బాధితుడే..

అయితే పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని దొంగలించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనికి గల ముఖ్య కారణం గణేష్ చతుర్థి రోజు శ్రీకృష్ణుడు పాల గ్లాసులో కనిపిస్తున్న చంద్రుని చూశాడు. దీంతో కన్నయ్య కూడా గణేశుడి శాపానికి విముక్తి పొందలేకపోయాడు.

Vinayaka Chavithi వినాయక చవితి రోజు చంద్రుడుని చూస్తే ఏమవుతుంది దోష నివారణకు ఏం చేయాలంటే

Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడుని చూస్తే ఏమవుతుంది..? దోష నివారణకు ఏం చేయాలంటే…!

చంద్రుని చూస్తే ఏం చేయాలి…

అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఇక ఈ వినాయక చవితి రోజున ఎవరైతే పొరపాటున చంద్రుని చూస్తారో వారు కొన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా శాపం నుంచి విముక్తి పొందవచ్చు. అయితే చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో వారు వినాయక వ్రత కథను చదివి ఉపవాసం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాక ఒక మంత్రాన్ని పట్టించడం ద్వారా కూడా ఈ దోషాల నుండి విముక్తి పొందవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది