
why gravel stones are placed in the middle of railway track
Railway Track : ఎక్కడికైనా వెళ్లడానికి అత్యంత సులభతరమైన రైలు ప్రయాణం. రైలు ప్రయాణం చాలా సులభంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి పొల్యూషన్ లేకుండా పచ్చని పొలాల మధ్యలో రైలు ప్రయాణిస్తుంటే ఎంత హాయిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. నిత్యం వేలాదిమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ మంచి ఆదరణ పొందింది. రైలు చార్జీలు కూడా తక్కువగా ఉండడంట సామాన్య ప్రజలు రైలు ప్రయాణం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇండియన్ రైల్వే ప్రయాణికులు సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సురక్షితంగా చేరవేస్తూ ఉంటుంది.
వర్తక వాణిజ్యంలో కూడా ఇండియన్ రైల్వే కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రైల్వే ట్రాక్ మధ్య కంకర రాళ్లు ఉండడం మనం చూసే ఉంటాం. కానీ అలా ఎందుకు వేస్తారు మనలో చాలామందికి తెలియదు. రైలు పట్టాల మధ్యలో కంకర రాళ్ళను వేస్తుంటారు రైల్వే సిబ్బంది. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఈ కంకర రాళ్లను ట్రాక్ బాలస్ట్ గా పిలుస్తారు. దీనికి గల కారణం పట్టాలు నిర్దిష్ట స్థానంలో ఉండేందుకు కంకర ను పట్టాల మధ్యలో, ఇరువైపులా నింపుతూ ఉంటారు. అలాగే ఇలా కంకర రాళ్ళను పోయడానికి మరొక కారణం కూడా ఉంది.
why gravel stones are placed in the middle of railway track
రైలు భారీ కంపార్ట్మెంట్ లతో పెద్దగా ఉన్న రైలు పట్టాలపై వెళుతుంటే భారీగా శబ్దాలు వస్తుంటాయి. పెద్ద శబ్దంతో పాటు దగ్గరలోని నిర్మాణాలు, భవనాలకు ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం తొలగించడానికే ఈ పదునైన రాళ్లను ఉపయోగిస్తారు. రైలు ప్రయాణించేటప్పుడు వచ్చే శబ్ధాలను ఈ రాళ్లు తగ్గిస్తాయి. అలాగే ట్రాక్ పై పిచ్చి మొక్కులు పెరగ కుండా నివారించేందుకు కంకరను ఉపయోగిస్తారు. వర్షం పడ్డప్పుడు నీరు ట్రాక్ పై నిలవకుండా ఉండేందుకు కూడా కంకర రాళ్లను ఉపయోగిస్తారు. పట్టాల మధ్య ఉన్న కంకర రాళ్లతో రైలు సురక్షితంగా ప్రయాణించగలదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.