Pawan Kalyan : బిగ్ లాజిక్ మిస్ అయిన పవన్ కళ్యాణ్.. దెబ్బ మీద దెబ్బ..!
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 10 ఏళ్లు అవుతోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లు అయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ నిర్వహించనుంది. ఈనేపథ్యంలో ఈనెల 14న మచిలీపట్నంలో సభను ఏర్పాటు చేయనుంది. దాని కోసం పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు పవన్ కళ్యాణ్ హాజరయి.. జనసైనికులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారాహిలోనే ఈ సభకు పవన్ రానున్నారు. ఈ సభా వేదికకు పొట్టి శ్రీరాములు అనే పేరును పెట్టారు.
ఈ సభను పింగళి వెంకయ్య, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో నిర్వహిస్తామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఇదంతా పక్కన పెడితే మరోవైపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎవ్వరూ వైసీపీకి ఓటేయొద్దు అని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కరెక్టే.. వైసీపీకి ఓటేయొద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారు అది కూడా ఓకే కానీ.. అసలు.. ఎవరికి ఓటేయాలి. పవన్ కళ్యాణ్ ప్రకారం..
Pawan Kalyan : ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటున్న జనసేన
ఎవరికి ఓటేయాలి అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. పోనీ.. జనసేనతో పొత్తు ఉన్న బీజేపీకి ఓటు వేయాలా? అది కూడా చెప్పలేదు. పోనీ.. త్వరలో పొత్తు అని ప్రకటించుకున్న టీడీపీకి ఓటేయాలా? ఏది చెప్పలేదు. కానీ.. వైసీపీకి మాత్రం ఓటేయొద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా పవన్ కు రాజకీయాల్లో క్లారిటీగా మాట్లాడటం రాకపోతే ఎట్లా.. అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని జనసైనికులను పవన్ సూచించారట. మరి.. వైసీపీకి వ్యతిరేకంగా అంటే ఏంటో.. అంటూ ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.