KCR – Kondagattu : ఇన్ని సంవత్సరాల తరవాత కేసీఆర్ కొండగట్టుకి వెళ్ళడానికి అసలు కారణం ఇదన్నమాట !
KCR – Kondagattu : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కొండగట్టును దర్శించుకున్న విషయం తెలిసిందే. నిజానికి కొండగట్టు అంజన్న స్వామి దేవాయలం తెలంగాణలోనే అతిపెద్దది. ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. తెలంగాణలోనూ పలు అంజన్న స్వామి దేవాలయాలు ఉన్నాయి కానీ.. కొండగట్టు అంజన్న దేవాలయం విశిష్టత వేరు. తెలంగాణ మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కొండగట్టుకు వచ్చి అంజన్నను దర్శించుకొని వెళ్తారు భక్తులు. కొండగట్టుకు వెళ్లాలంటే అదృష్టం ఉండాలి, స్వామి వారి అనుగ్రహం ఉండాలి. లేదంటే కొండగట్టుకు వెళ్లలేం.
సీఎం కేసీఆర్ తాజాగా కొండగట్టుకు వెళ్లడంతో అంజన్న అనుగ్రహంతోనే ఆయన కొండగట్టులో అడుగు పెట్టారని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు కరీంనగర్ కు వచ్చిన కేసీఆర్.. కొండగట్టుకు మాత్రం వెళ్లలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టుకు వెళ్లారు. తన వారాహీ వాహనానికి అక్కడ పూజలు చేయించారు. ఇక.. కేసీఆర్ చివరిసారిగా 25 ఏళ్ల కింద తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వెళ్లడం.
KCR – Kondagattu : రవాణా మంత్రిగా ఉన్నసమయంలో కొండగట్టుకు వెళ్లిన కేసీఆర్
చంద్రబాబు కేబినేట్ లో 1998 లో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో అప్పుడు కొండగట్టును దర్శించుకున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కేసీఆర్ కొండగట్టును దర్శించుకున్నారు. అప్పుడు కొండగట్టులో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ పాతికేళ్ల తర్వాత కొండగట్టును దర్శించుకొని.. కొండగట్టును యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దడం కోసం రూ.100 కోట్లను కేటాయించారు.