KCR – Jagan : కేసీఆర్ చెప్పింది నిజమేనా? ఏపీలో బీజేపీ ప్రభుత్వం రానుందా? వైసీపీ ఖేల్ ఖతమేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR – Jagan : కేసీఆర్ చెప్పింది నిజమేనా? ఏపీలో బీజేపీ ప్రభుత్వం రానుందా? వైసీపీ ఖేల్ ఖతమేనా?

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2022,7:40 pm

KCR – Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మరో అలజడి మొదలైంది. అదే తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీని ఒక్కసారిగా కుదిపేశాయి. దానికి కారణం.. ఏపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తోందా? ఆయన చెప్పిన వ్యాఖ్యలు నిజమేనా? ఏపీలో బీజేపీ ప్రభుత్వం రానుందా? వచ్చే నెలలోనే ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ ముగ్గురి ఆడియోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో ఇదే ఉందని స్పష్టం అయిందని ఆయన తెలిపారు.

అసలు వచ్చే నెల అంటే డిసెంబర్ లో ఏం జరగబోతోంది అనేది ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది. అసలు ఏపీలో ప్రభుత్వాన్ని కూలదోయడం అంటే సాధ్యం కాని పని. కావాల్సిన మెజారిటీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. తెలంగాణలోనూ అంతే. మరి ఇటువంటి నేపథ్యంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎలా కూల్చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అంతే. ఎమ్మెల్యేతో ఎక్కువగా మాట్లాడరు. వాళ్లను కలవు. రెండు రాష్ట్రాల సీఎంలు ఎమ్మెల్యేల విషయంలో నియంతలుగా వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలుసు. దాన్నే బీజేపీ క్యాష్ చేసుకోనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

why kcr words creating tension in ap politics

why kcr words creating tension in ap politics

KCR – Jagan : వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకుంటుందా?

అయినా కూడా వైసీపీకి చెందిన 155 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొంటుందా? అందరు బీజేపీ వైపు మళ్లుతారా? అంత ధైర్యం ఎమ్మెల్యేలు చేస్తారా? ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటి. నిజానికి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడేంత ధైర్యం చేయరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఒకరో ఇద్దరో పార్టీ వీడాలనుకున్నా.. టీడీపీ లేదంటే జనసేన వైపు వెళ్తారు కానీ.. అసలు ఏపీలో ఎలాంటి ప్రభావం లేని బీజేపీ పార్టీలోకి ఎందుకు చేరుతారు అని మరికొందరు వాదిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంతా ఉత్త బూటకం అంటూ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. చూద్దాం మరి కేసీఆర్ వ్యాఖ్యలు నిజం అవుతాయో? కావో.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది