Renu Desai – Pawan Kalyan : ఇన్నేళ్ళకి బయటపడిన దారుణ నిజం.. రేణూ దేశాయ్ – పవన్ కళ్యాణ్ విడిపోవడానికి కారణం ఇదే..!
Renu Desai – Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో పవర్ స్టార్ కానీ.. ఆయన రాజకీయ జీవితం, పర్సనల్ లైఫ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్న పవన్ ను ఆయన ప్రత్యర్థులు ట్రోల్ చేస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ ఎద్దేవా చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడిపోయిన విషయం గురించి ఎవ్వరూ మాట్లాడరు కానీ.. రెండో భార్య రేణూ దేశాయ్ తో విడిపోయిన విషయం గురించి మాత్రం ఇండస్ట్రీనే కోడై కూస్తుంది.
వాళ్లిద్దరూ విడిపోయి పదేళ్లు అవుతున్నా ఇంకా వాళ్ల విడాకులు విషయం మాత్రం చర్చనీయాంశమే అవుతోంది రోజురోజుకూ. నిజానికి.. వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని చాలామంది అనుకుంటున్నారు కానీ.. అది అసాధ్యం అనే చెప్పుకోవాలి. అయితే.. తాజాగా అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా రేణు దేశాయ్.. ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అకీరా, రేణూ ఇద్దరూ ఉంటారు. ఆ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసి.. ఎప్పుడూ ఇలాగే మా అన్న కొడుకుని చూపిస్తూ ఉండండి అంటూ కామెంట్లు చేశారు. అయితే.. పవన్ అభిమానులు చేసిన కామెంట్స్ కు రేణూ దేశాయ్ రెచ్చిపోయింది.
Renu Desai – Pawan Kalyan : పవన్ అభిమానుల కామెంట్స్ కి రెచ్చిపోయిన రేణూ దేశాయ్
మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు. ఇక చాలు. ఇన్ని రోజులు ఇలాంటి మాటలు చాలా భరిస్తూ వచ్చాను. ఇక నుంచి భరించలేను. బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ ఘాటుగానే పవన్ అభిమానులకు రిప్లయి ఇచ్చింది రేణూ దేశాయ్. వామ్మో.. మేము ఏమన్నాం అని. మా అన్న కొడుకుని చూపించండి అనడం నెగెటివ్ కామెంట్సా? రేణూ వదిన ఏంటి ఇలా మారిపోయింది.. అకీరా నాన్న పవన్ అయినప్పుడు అన్న కొడుకు అనక ఇంకేం అనాలి. ఇలాంటి చిల్లర వేషాలు వేసినందుకే.. పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటికి గెంటేసినట్టున్నారు అంటూ రేణు దేశాయ్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….