పవన్ కళ్యాణ్ తలుచుకుంటే బీజేపీకి చుక్కలే? కానీ.. ఎందుకో పవన్ వెనకడుగేస్తున్నారు?
పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి.. కాస్తో కూస్తో ఇప్పుడిప్పుడే ఏపీలో ఓటు బ్యాంకు తెచ్చుకుంటున్నారు. కానీ.. ఆయన చేసిన ఒకే ఒక తప్పు.. బీజేపీతో జతకట్టడం. ఎందుకంటే.. బీజేపీ.. జనసేనను ఒక పావులా వాడుకుంటుంది తప్పితే.. జనసేనకు లాభం కలిగే పనులేవీ చేయట్లేదు.
ప్రస్తుతం బీజేపీ ప్లాన్ ఒక్కటే. ఏపీలో అధికారంలోకి రావడం. దానికోసం ఏదైనా చేసేలా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జనసేనతో జతకట్టింది అంటే దానికి కారణం కూడా ఏపీలో గెలవడం కోసమే తప్పితే ఏదో జనసేనను ఉద్దరించడం కోసం కాదు.
కానీ.. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు లేట్ గా అర్థమయింది. ప్రతి సారి జనసేనను బీజేపీ తొక్కేసే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో టీడీపీని నామరూపం లేకుండా చేసి.. జనసేన మద్దతుతో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ప్లాన్. కానీ.. బీజేపీ కుయుక్తులను తెలుసుకోకుండా.. పవన్ కళ్యాణ్ దానితో జతకట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కోసం పోటీ చేయకుండా తప్పుకున్నారు పవన్ కళ్యాణ్.
సర్లే.. కనీసం తిరుపతి ఉపఎన్నికల్లో అయినా చాన్స్ వస్తుంది కదా.. ఉపఎన్నికలో గెలిచి జనసేన సత్తా చాటాలని ఎన్నో కలలు కన్నారు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక టికెట్ ను కూడా బీజేపీ గుంజుకోవడంతో ఏం చేయాలో తెలియక పవన్ సతమతమవుతున్నారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏపీలో బీజేపీని ఈజీగా బ్యాడ్ చేయొచ్చు కానీ.. ఆయనెందుకో వెనకడుగేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీనే నమ్ముకొని ముందుకెళ్తే.. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా గెలిచే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.